అరవింద సమేత రికార్డు బిజినెస్..!

Update: 2018-08-24 06:35 GMT

ఎన్టీఆర్ 'టెంపర్' మూవీ నుండి చూసుకుంటే ఆ తర్వాత చేసిన మూడు సినిమాలు హిట్ అయ్యాయి. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ ఈ నాలుగు సినిమాలతో తారక్ జైత్ర యాత్ర సాగిస్తున్నాడు. దీంతో ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీపై మరింత అంచనాలు పెరిగిపోయాయి. బిజినెస్ పరంగా చూసుకుంటే 'అరవింద సమేత' హక్కులు కొనడానికి బయర్స్ వెనకాడటంలేదంట. అంతలా ఈ సినిమా బిజినెస్ వర్గాలపై ప్రభావం చూపుతుంది. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఈ సినిమా సీడెడ్ హక్కుల్లో టాప్ 4 పొజిషన్ ని కైవసం చేసుకుంది.

టాప్ 4లో చేరిన అరవింద...

గతంలో ఏ సినిమాలు టాప్ 4 లిస్ట్ లో ఉన్నాయో చూసుకుంటే...బాహుబలి2 - 25 కోట్లు, పవన్ అజ్ఞతావాసి 16.20 కోట్లు, చరణ్ 12- 15.40 కోట్లతో తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఆ తర్వాతి స్థానంలో 'అరవింద సమేత' 15 కోట్లతో టాప్ 4లో నిలిచింది. దాంతో తారక్ ఖాతాలో మరో రికార్డు వచ్చి పడింది. అయితే ఈ సినిమాకు ఇంత డిమాండ్ రావడానికి కారణం.. ఇది రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ సినిమా కాబట్టి. దానికి తోడు రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ ఈ సినిమాను బిజినెస్ ను మరింత పెంచేసింది.

15 కోట్లు వసూలు చేస్తుందా..?

దాంతో హారిక & హాసిని సంస్థ వారు ఈ సినిమాను పబ్లిసిటీతో పాటు ప్రింట్ ఖర్చులు కలుపుకుని 15కోట్లకు గిట్టుబాటు అయ్యేలా ఒప్పందాలు చేసుకుందట. మరి సీడెడ్ లో ఈ సినిమా అంతలా వసూల్ చేయాలంటే మొదటి రోజు ఆటకే బ్లాక్ బస్టర్ టాక్ వస్తే తప్ప కుదరదు. ఇప్పటివరకు సీడెడ్ వసూళ్ల రికార్డులు పరిశీలిస్తే బాహుబలి 1, ఖైదీనంబర్ 150, బాహుబలి 2, రంగస్థలం మూవీస్ మాత్రమే 15 కోట్లు షేర్ వసూల్ చేసాయి. మిగితా ఏ సినిమా ఇలా వసూల్ చేసిన దాఖలాలు లేవు. మరి అరవింద సమేత పరిస్థితి ఏంటో చూడాలి.

Similar News