అరవిందకు అదిరిపోయే బిజినెస్..!

Update: 2018-10-02 06:24 GMT

త్రివిక్రమ్ - ఎన్టీఆర్ కాంబినేషన్ లో 'అరవింద సమేత' అనే చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై అటు త్రివిక్రమ్ ఫ్యాన్స్ లో... ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంచనాలు పెంచుకున్నారు. ట్రేడ్ వర్గాల్లో కూడా ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. దాంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిసినెస్ కూడా అదే స్థాయిలో జరిగింది.

అన్ని ప్రాంతాల్లో మంచి బిజినెస్

వరస సినిమాలతో ఫామ్ లో ఉన్న ఎన్టీఆర్ సినిమా కాబట్టి అన్ని ఏరియాస్ కలిపి సుమారు 100కోట్లకు ఈ సినిమా అమ్ముడైనట్టు తెలుస్తుంది. నిర్మాతలు అడిగినంత డిస్ట్రిబ్యూటర్స్ చెల్లించేస్తున్నారని సమాచారం. ఇతర దేశాల బిసినెస్ కూడా భారీ లెవెల్ లో జరిగిందని టాక్. ఆల్రెడీ అక్కడ టికెట్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ చేసారు. దసరా కానుకగా అక్టోబర్ 11న వస్తున్న ఈ చిత్రం హిట్ టాక్ సొంతం చేసుకుంటే 100కోట్లు రాబట్టడం పెద్ద కష్టమేమి కాదని చెబుతున్నారు ట్రేడ్ వారు.

Similar News