అరవింద లో అభయ్..?

Update: 2018-10-06 07:16 GMT

ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని డైరెక్టర్ త్రివిక్రమ్ 'అరవింద సమేత' చిత్రాన్ని భారీ లెవెల్ లో రూపొందించిన విషయం తెలిసిందే. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ తో ఎన్టీఆర్ అభిమానులే కాదు సామాన్య ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ప్రీ రిలీజ్ బిజినెస్ ఒక రేంజ్ లో జరగడంతో ట్రేడ్ వారు కూడా ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా స్టోరీ ఏంటి అనేది రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది. ఈ చిత్రం కు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ చిన్నప్పుడు సీన్స్ ఉన్నాయట.

అభయ్ కనిపిస్తాడా..?

ఎన్టీఆర్ చిన్నప్పటి పాత్రలో ఎన్టీఆర్ పెద్ద కుమారుడు అభయ్ రామ్ కనిపించనున్నాడనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు మాత్రం ఇది ఒక పండగ లాంటి వార్త. మహేష్ బాబు కొడుకు గౌతమ్ 'వన్ నెన్నొక్కడినే' లో చిన్న రోల్ చేసి మహేష్ ఫ్యాన్స్ ను అలరించాడు. అలానే ఎన్టీఆర్ కుమారుడు అభయ్ రామ్ కూడా అలరిస్తాడని భావిస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఎన్టీఆర్ కి జోడిగా ఈషా, పూజా హీరోయిన్స్ నటిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందించాడు. దసరా కానుకగా ఈ చిత్రం ఈనెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Similar News