ఫస్ట్ హాఫ్ ఫ్యామిలీ.. సెకండ్ హాఫ్ యాక్షన్..?

Update: 2018-05-21 11:18 GMT

త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న 'అరవింద సమేత వీర రాఘవ' ఫస్ట్ లుక్ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది. ఫస్ట్ లుక్ తోనే సగం ఇంప్రెస్స్ కొట్టేసిన త్రివిక్రమ్ - ఎన్టీఆర్ లు ఈ సినిమా ఆఘమేఘాల మీద పూర్తి చేస్తున్నారు. అందుకే ఎన్టీఆర్ తనకి కోట్లు తెచ్చే బిగ్ బాస్ సీజన్ 2 ని కూడా వదులుకున్నాడు. ఎలాగైనా దసరా కల్లా తమ సినిమాని పూర్తి చెయ్యాలని అటు త్రివిక్రమ్, ఇటు ఎన్టీఆర్ లు కంకణం కట్టుకున్నారు. అందుకే షూటింగ్ మొదలు పెట్టిన చాలా కొద్దీ రోజులకే ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ తో అందరిని పడేసారు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ తో అదరగొడతాడని అరవింద సమేత ఫస్ట్ లుక్ లో మాస్ ఆడియన్స్ ని పడేసేలా కనబడుతుంది. అలాగే ఎన్టీఆర్ లో రొమాంటిక్ యాంగిల్ కి కూడా తక్కువ లేకుండా హీరోయిన్ పూజ హెగ్డేతో పిట్ట గోడ మీద కూర్చుని లవర్ బాయ్ మాదిరిగా ఎన్టీఆర్ క్లాస్ లుక్ తో దుమ్మురేపుతున్నాడు.

క్లాస్ ఆండ్ మాస్..

మరి త్రివిక్రమ్ రెండు లుక్ లతో ఎన్టీఆర్ ని చూపించినట్టుగానే సినిమాలోనూ ఎన్టీఆర్ రెండు షేడ్స్ ఉన్న పాత్రల్లో కనబడతాడట. అందులో అరవింద సమేత ఫస్ట్ హాఫ్ లో కుటుంబానికి దగ్గరగా ఉండే సిల్లీ బాయ్ లా, కుటుంబ బంధాలకి విలువనిచ్చే సాఫ్ట్ కేరక్టర్ లో కనిపిస్తాడట. అలాగే కథానుసారంగా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఉండే ఈ సినిమా సెకండ్ హాఫ్ లో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ తో విలన్స్ ని చితకబాదే యాక్షన్ అంటే మాస్ పాత్రలో కనబడతాడని అంటున్నారు. మరి ఈ రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రల్లోనూ ఎన్టీఆర్ దుమ్మురేపడం ఖాయమంటున్నారు ఎన్టీఆర్ ఫాన్స్. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ డైరెక్టర్. ఇక ఈ సినిమాని వచ్చే దసరా బరిలో నిలపాలని చూస్తున్నారు.

Similar News