అరవింద రేంజ్ అదిరింది..!

Update: 2018-10-05 06:41 GMT

ప్రస్తుతం సోషల్ మీడియాలో టాప్ ట్రేండింగ్ లో ఉన్న టాపిక్ ఏమైనా ఉంది అంటే అది త్రివిక్రమ్ - యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబోలో మరో వారం రోజుల్లో విడుదల కాబోతున్న అరవింద సమేత వీర రాఘవ సినిమా టాపిక్కే. ఎన్టీఆర్ కి జోడిగా పూజ హెగ్డే, ఇషా రెబ్బలు నటిస్తున్న ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన అరవింద సమేత ట్రైలర్ యూట్యూబ్ లో దుమ్ము రేపుతోంది. మరి ట్రేడ్ లో ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్న అరవింద సమేత ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదిరిపోయే లెవల్లో జరిగింది. ఎన్టీఆర్ స్టామినా, క్రేజ్, త్రివిక్రమ్ కాంబో అన్ని అరవింద మీద అంచనాలు పెంచినట్టుగానే.. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఆ రేంజ్ లో జరిగింది. ఎన్టీఆర్ కి ఉన్న స్టామినాతో సీడెడ్, నైజాం, అర్బన్ ఏరియాస్ దగ్గర నుండి... ఓవర్సీస్ వరకు అడుగడుగునా ఎన్టీఆర్ అరవింద సమేత బిజినెస్ చూస్తుంటే.. ఈ సినిమా మీదున్న అంచనాలు మామూలివి కాదనిపిస్తుంది. అరవింద సమేత ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు మీకోసం.

ఏరియా షేర్(కోట్లలో)

నిజాం 19.50

సీడెడ్ 15.00

అర్బన్ ఏరియాస్ 9.25

ఈస్ట్ గోదావరి 6.05

కృష్ణ 5.50

గుంటూరు 7.50

వెస్ట్ గోదావరి 4.90

నెల్లూరు 3.30

ఏపీ అండ్ టీఎస్ షేర్స్ 71.00 కోట్లు

ఇతర ప్రాంతాలు 9.50

ఓవర్సీస్ 12.50

వరల్డ్ వైడ్ షేర్స్ 93.00 కోట్లు

Similar News