అరవింద దొంగలు దొరికేసారు..!

Update: 2018-08-15 07:43 GMT

'గీత గోవిందం' సినిమా నుండి కొన్ని సీన్స్ లీక్ అయ్యి ఆన్ లైన్ లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఈ సినిమా విడుదలై హిట్ రూపంలో దూసుకుపోవడంతో..మేకర్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు. కానీ దసరాకు రిలీజ్ అవ్వాల్సిన ‘అరవింద సమేత’ నుండి కూడా కొన్ని సీన్స్ బయటికి వచ్చాయి. త్రివిక్రమ్ - ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రం నుండి మూడు నిమిషాల వీడియో క్లిప్ రీసెంట్ గా లీక్ అయింది.

మూడు నిమిషాల క్లిప్ వీడియో

అయితే అరవింద సమేత లీకేజీకి పాల్పడిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. సినిమా షూటింగ్ అవ్వగానే రోజువారీగా హార్డ్ డిస్క్ లో కాపీ చేసి.. డేటాను భద్రపరిచే బాధ్యతను నిర్మాణ సంస్థ ఫిలింనగర్‌లోని ఓ డేటా డిజిటల్ బ్యాంకుకు అప్పగిస్తారు. అందులో పని చేసే ఓ వ్యక్తి ఈ మూడు నిమిషాల వీడియో క్లిప్ ను లీక్ చేసినట్టు తెలిసింది.

లీక్ చేసి యూట్యూబ్ లో...

ఆ వీడియో యూట్యూబ్ లో కూడా రావడంతో నిర్మాతలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డేటాను భద్రపరిచే విభాగంలో పనిచేస్తున్న చక్రవర్తి అనే యువకుడు ఈ వీడియో లీక్ కు పాల్పడినట్టు తెలుసుకుని అతడిని అరెస్ట్ చేశారు. చక్రవర్తి అనే వ్యక్తి తన స్నేహితులకు షేర్ చేయడంతో ఆ క్లిప్ బయటకి వచ్చింది. పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలకే ఇలా జరిగితే చిన్న నిర్మాణ సంస్థల పరిస్థితి ఏంటో మరి.

Similar News