జోరుమీదున్న జూనియ‌ర్‌...

Update: 2018-06-04 10:43 GMT

తారక్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం 'అరవింద సమేత వీర రాఘవ'. రీసెంట్ గా ఈ చిత్రానికి సంబంధించి తారక్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఒకటి విడుదల చేశారు. తారక్ తన సిక్స్ ప్యాక్ బాడీ ని రివీల్ చేస్తూ వచ్చిన పోస్టర్, సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ పెంచేసాయి.

రాయ‌ల‌సీమ యాస‌లో...

రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుని మూడవ షెడ్యూల్ లో కి ఈరోజే ఎంటర్ అయ్యారు. ఈనెల మొత్తం ఈ షెడ్యూల్ షూటింగ్ కొనసాగనుంది. ఎన్టీఆర్ తో పాటు కొన్ని కీలక పాత్రలతో కీలకమైన సన్నివేశాలను ఈ షెడ్యూల్లో తెరకెక్కించనున్నారు. ఇది రాయలసీమ నేపథ్యంలో సాగే సినిమా కాబట్టి ఇందులో ఎన్టీఆర్ రాయలసీమ యాసలో మాట్లాడనున్నాడని తెలిసిన విషయమే.

మెప్పిస్తున్న త‌మ‌న్‌...

మొదట ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ అనుకున్నారు కానీ కొన్ని కారణాలు వల్ల అనిరుద్ తప్పుకోవడంతో ఆ బాధ్యతలు తమన్ తీసుకున్నాడు. ఆల్రెడీ మూడు ట్యూన్స్ తో సినిమా యూనిట్ ని మేపించాడంట. ఎన్టీఆర్ కెరియర్లోనే ఈ సినిమా చెప్పుకోదగినదిగా నిలుస్తుందనేది ఆయన అభిమానుల మాట.

Similar News