సినిమాలకు ఏపీ ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాలు

Update: 2018-08-21 13:45 GMT

సినీ పరిశ్రమకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాలు ప్రకటించింది. రూ. నాలుగు కోట్ల కంటే తక్కువ బడ్జెట్ తో తీసే సినిమాలను చిన్న సినిమాలుగా పరిగణించి ఆ సినిమాల ద్వారా వచ్చే పన్నును తిరిగి ఇచ్చేస్తామని ఏపీ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ అంబికా కృష్ణ ప్రకటించారు. పూర్తిగా ఆంధ్రప్రదేశ్ లో చిత్రీకరించే సినిమాలకు ప్రోత్సాహకాలతో పాటు పన్ను రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపారు. చిన్న సినిమాలకు పన్ను రాయితీతో పాటు షూటింగ్ లకు ఉచితంగా లొకేషన్లు ఇస్తామని, ఎఫ్డీసీ ద్వారా సింగల్ విండో పద్ధతిలో అనుమతులు ఇస్తామని ఆయన పేర్కొన్నారు. షూటింగ్ లకు సంబంధించి సెక్యూరిటీ డిపాజిట్ చెల్లిస్తే సరిపోతుందని, చిత్రీకరణ పూర్తయిన తర్వాత ఆ డబ్బును తిరిగి చెల్లిస్తామని, అయితే, డబ్బింగ్, రీరికార్డింగ్, పోస్ట్ ప్రొడక్షన్ ప్రక్రియ మాత్రం రాష్ట్రంలోనే చేయాలని షరతు విధిస్తున్నట్లు ప్రకటించారు.

Similar News