వినిపించదు..కనిపించదు అంట!

‘బాహుబలి’ ముందు ఏమో కానీ ‘బాహుబలి’ తరువాత అనుష్క శెట్టి ఫిమేల్ ఓరియెంటెడ్ పాత్రలకే ఇంపార్టెన్స్ ఇస్తుంది. అందుకే ‘భాగమతి’ లాంటి సినిమాను చేసింది. ఈసినిమా వచ్చి [more]

Update: 2018-12-29 09:44 GMT

‘బాహుబలి’ ముందు ఏమో కానీ ‘బాహుబలి’ తరువాత అనుష్క శెట్టి ఫిమేల్ ఓరియెంటెడ్ పాత్రలకే ఇంపార్టెన్స్ ఇస్తుంది. అందుకే ‘భాగమతి’ లాంటి సినిమాను చేసింది. ఈసినిమా వచ్చి ఏడాది కావొస్తున్నా అనుష్క ఇంతవరకు తన నెక్స్ట్ సినిమా ను ప్రకటించలేదు. ‘జీరో’ మూవీ కోసం వెయిట్ పెరిగిన స్వీటీ, వెయిట్ తగ్గేందుకు విదేశాలకు వెళ్లిందని ఆ మధ్య వార్తలు వచ్చాయి.

వైవిధ్యం ఉంటేనే….

అందుకే సినిమాలని ఓకే చేయడం లేదని సమాచారం. అనుష్క ఏదన్నా సినిమాను ఓకే చేయాలంటే కథ…కథనాల్లో కొత్తదనం .. పాత్ర పరంగా వైవిధ్యం ఉంటేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. అందుకే ఇంత గ్యాప్ తీసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే హేమంత్ మధుకర్ వినిపించిన కథ అనుష్కకి చాలా భిన్నంగా అనిపించిందట. ఇటువంటి పాత్రలో ఎన్నడూ నటించలేదని హేమంత్ మధుకర్ చెప్పిన కథ ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో వెంటనే ఓకే చెప్పేసిందట.

సైలెన్స్ మూవీలో….

ఈసినిమాకు ‘సైలెన్స్’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. అనుష్క ఇందులో చూపు .. వినికిడి శక్తి లేని పాత్రలో కనిపించనుందట. ఈమె చుట్టూనే సినిమా మొత్తం తిరుగుతుంది. అనూహ్యమైన మలుపులతో .. ఉత్కంఠభరితంగా ఈ కథ కొనసాగుతుందని అంటున్నారు. కోన ఫిల్మ్ కార్పొరేషన్ .. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమా లో అనుష్క సరసన బాలీవుడ్ విలక్షణ నటుడు మాధవన్ కనిపించనున్నాడు అని సమాచారం. వచ్చే నెల జనవరి లో ఈసినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు మేకర్స్.

Tags:    

Similar News