ఆచార్య కోసం అనుష్క?

కరోనావైరస్ వలన టాలీవుడ్ లో సినిమా ల షూటింగ్స్ అన్ని తాత్కాలికంగా ఆపేసారు. ప్రస్తుత షూటింగ్ షెడ్యూల్‌ను ఏప్రిల్‌కు వాయిదా వేయడానికి మెగాస్టార్ చిరంజీవి కూడా రేడి [more]

Update: 2020-03-16 16:34 GMT

కరోనావైరస్ వలన టాలీవుడ్ లో సినిమా ల షూటింగ్స్ అన్ని తాత్కాలికంగా ఆపేసారు. ప్రస్తుత షూటింగ్ షెడ్యూల్‌ను ఏప్రిల్‌కు వాయిదా వేయడానికి మెగాస్టార్ చిరంజీవి కూడా రేడి అవడమే కాదు.. ప్రెస్ నోట్ కూడా ఇప్పించాడు. అయితే ప్రస్తుతం ఆచార్య షూటింగ్ ఆగినా.. ఆ సినిమాలో హీరోయిన్ వెతుకులాటకు ఫుల్ స్టాప్ పడలేదు. కారణం ఇంతకు ముందు హీరోయిన్ గా ఎంపికైన త్రిష ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. తర్వాత త్రిష ప్లేస్ ని కాజల్ భర్తీ చేస్తుంది.. దానికోసం కాజల్ అగర్వాల్ భారీగా డిమాండ్ చేస్తుంది అంటూ పుకార్లు వెలువడ్డాయి.

కానీ తాజాగా నిశ్శబ్దంతో మళ్ళీ ఫామ్ లోకి రాబోతున్న అనుష్క శెట్టిని చిరు కి జోడిగా సంప్రదించడానికి కొరటాల బృందం రెడీ అవుతుందనే న్యూస్ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. అనుష్క అయితే చిరు కి పర్ఫెక్ట్ జోడి అని.. ప్రస్తుతం నిశ్శబ్దం తర్వాత అనుష్క మరో ప్రాజెక్ట్ సైన్ చెయ్యలేదు కాబట్టి..ఆనుష్కనే చిరు ఆచార్య కోసం తెవాలని మూవీ టీం గట్టిగానే డిసైడ్ అయ్యిందనే న్యూస్ వినబడుతుంది. మరి చివరగా ఆచార్య అవకాశం కాజల్ లేదా అనుష్క కి ఇద్దరిలో ఎవరికీ దక్కుతుందో ? మెగాస్టార్ సరసన ఎవరు ఆడిపాడతారో? అంటూ మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

Tags:    

Similar News