‘సైరా’ కథ చెప్పనున్న అనుష్క

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో అత్యంత భారీ బ‌డ్జెట్‌ సినిమాలో నటిస్తున్నాడు. స్వాతంత్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్య‌ల‌వాడ న‌ర్సింహారెడ్డి జీవిత‌క‌థ ఆధారంగా రూపొంద‌నున్న `సైరా` సినిమాలో చిరు [more]

Update: 2019-04-24 11:04 GMT

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో అత్యంత భారీ బ‌డ్జెట్‌ సినిమాలో నటిస్తున్నాడు. స్వాతంత్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్య‌ల‌వాడ న‌ర్సింహారెడ్డి జీవిత‌క‌థ ఆధారంగా రూపొంద‌నున్న 'సైరా' సినిమాలో చిరు నటిస్తున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాను సురేంద‌ర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. న‌య‌న‌తార‌, త‌మ‌న్నా హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. 70 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా 19వ శ‌తాబ్దానికి చెందిన కథ కావ‌డంతో నేరుగా క‌థ‌లోకి వెళ్ల‌కుండా, ఎవ‌రైనా ఒక వ్య‌క్తి చేత ఆ క‌థ చెప్పించాల‌ని ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డితో పాటు చిరంజీవి కూడా భావించాడట.

సరేనన్న అనుష్క

ఎవరు చెప్తే బాగుంటుంది అని ఆలోచిస్తున్న టైంలో వాళ్లకి ఓ పేరు తట్టింది. 'బాహుబలి'తో దేశ‌వ్యాప్తంగా గుర్తింపు సంపాదించిన అనుష్క చేత 'సైరా' క‌థ చెప్పిస్తే బాగుంటుంద‌ని రామ్ చరణ్ దగ్గర నుండి సురేంద్ర రెడ్డి వరకు అంతా అనుకున్నారట. అయితే విషయంపై అనుష్క ని సంప్రదించగా ఆమె ఓకే కూడా చెప్పినట్టు టాక్. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. ఇక ఈ చిత్రంలో అమితాబ్ బ‌చ్చ‌న్‌, జ‌గ‌ప‌తి బాబు, కిచ్చ సుదీప్‌, విజ‌య్ సేతుప‌తి వంటి ప్ర‌ముఖ న‌టులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

Tags:    

Similar News