చిరు కోసం దేవసేన స్టెప్స్..!

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న‌ చిరు సైరా షూటింగ్ చివరి దశలో ఉంది. చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో అమితాబ్, విజయ్ సేతుపతి, సుదీప్, తమన్నా, జగపతి [more]

Update: 2019-05-05 12:18 GMT

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న‌ చిరు సైరా షూటింగ్ చివరి దశలో ఉంది. చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో అమితాబ్, విజయ్ సేతుపతి, సుదీప్, తమన్నా, జగపతి బాబు కీలకపాత్రల్లో తెరకెక్కుతున్న సైరా షూటింగ్ గత రెండేళ్లుగా సుదీర్ఘంగా జరుపుకుంటుంది. అన్ని షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న సైరా చివరి షెడ్యూల్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. ఈ చివరి షెడ్యూల్ లో సైరా బృందం స్పెషల్ సాంగ్ ని డిజైన్ చేసిందట. అయితే సైరాలో ఒక స్పెషల్ సాంగ్ ఉంటుందని తెలుసు కానీ ఆ సాంగ్ ఎవరితో చేయిస్తున్నారు అనే దాని మీద క్లారిటీ లేదు.

మ‌రోసారి చిరుతో స్టెప్పులు…

తాజాగా చిరు సైరా కోసం బాహుబలి దేవసేన అనుష్క దిగుతుందని సమాచారం. గతంలో చిరుతో స్టాలిన్ సినిమాలో స్పెషల్ సాంగ్ లో నర్తించిన అనుష్క మరోమారు ఇప్పుడు సైరాలో కూడా చిరుతో స్టెప్స్ వేయనుందని సమాచారం. త్వరలోనే అనుష్క ఈ సాంగ్ షూటింగ్ లో పాల్గొననుందని చెబుతున్నారు. మరి నయనతార, తమన్నాలే కాకుండా సైరాలో అనుష్క కూడా ఓ భాగం కాబోతుంది. భాగమతి తర్వాత మళ్లీ సినిమాల్లో నటించని అనుష్క ఇప్పుడు స్లిమ్ గా తయారై సినిమాల్లో బిజీ కాబోతుంది. ఇప్పటికే సైలెన్స్ సినిమాలో నటిస్తున్న అనుష్క ఇప్పుడు సైరాలో ఐటెం సాంగ్ లో మెరవబోతుంది.

Tags:    

Similar News