సైరాలో అనుష్క పాత్ర ఏంటో తెలుసా..?

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే ఎంత గ్రాండ్ లెవెల్ లో తెరకెక్కుతున్న చిత్రం ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత చరిత్ర సైరా చిత్రం. దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకుని [more]

Update: 2019-05-15 08:38 GMT

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే ఎంత గ్రాండ్ లెవెల్ లో తెరకెక్కుతున్న చిత్రం ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత చరిత్ర సైరా చిత్రం. దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకుని తుది దశలో ఉన్న ఈ సినిమాను సురేంద‌ర్ రెడ్డి దర్శకత్వం చేస్తున్నాడు. కాగా ఇందులో అనుష్క శెట్టి ఓ కీలక పాత్ర చేస్తుందని వార్తలు వస్తున్నాయి. అవును ఇందులో అనుష్క ఓ ఇంపార్టెంట్ పాత్రలో కనిపించనుందట. అది కూడా యాంకర్ గా కనిస్తోందట.

క‌థ చెప్ప‌నున్న అనుష్క‌

మూవీ స్టార్టింగ్ లోనే అనుష్క ఎంట్రీ ఇస్తోందని.. ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలోనే ‘సైరా నరసింహారెడ్డి’ స్టోరీ మొదలవుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెకు సంబంధించి షూటింగ్ జరుగుతుంది. ఇక ఇందులో చిరు సరసన నయనతార నటిస్తుంది. అలానే తమిళ నటుడు విజయ్ సేతుపతితో పాటు కన్నడ నటుడు కిచ్చ సుదీప్, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్నారు. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని పలు భాషల్లో రిలీజ్ చేయనున్నారు నిర్మాత రామ్ చరణ్.

Tags:    

Similar News