అనుష్క ఒప్పుకోనంటుందా?

సినిమాలకు భారీ గ్యాప్ ఇచ్చిన అనుష్క కి నిశ్శబ్దం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావాలనుకుంటే అందరిలానే కరోనా పెద్ద షాక్ ఇచ్చింది. నిశ్శబ్దం థియేటర్స్ లో రిలీజ్ [more]

Update: 2020-08-18 06:02 GMT

సినిమాలకు భారీ గ్యాప్ ఇచ్చిన అనుష్క కి నిశ్శబ్దం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావాలనుకుంటే అందరిలానే కరోనా పెద్ద షాక్ ఇచ్చింది. నిశ్శబ్దం థియేటర్స్ లో రిలీజ్ అవుతుందా? ఓటిటిలోనా అనేది ఇప్పటికి క్లారిటీ లేదు… చివరికి అనుష్క నిశ్శబ్దం కూడా ఓటిటి బాట పట్టే అవకాశాలు పుష్కలంగానే ఉన్నాయి. అయితే నిశ్శబ్దం సినిమా గనక థియేటర్స్ లో విడుదలైతే అనుష్క ముచ్చట్లేమైన బయటికొచ్చేవి. ఎందుకంటే ప్రెస్ మీట్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ తో అనుష్క కాస్త మాట్లాడేది. కెరీర్ గురించి, అలాగే పెర్సెనల్ లైఫ్ గురించి.

అయితే నిశ్శబ్దం తర్వాత అనుష్క ఆఫీసియల్ గా ఏ సినిమా కూడా ఒప్పుకోలేదు. కానీ తమిళంలో విజయ్ సేతుపతి సినిమాలో అనుష్క నటిస్తుంది అనే టాక్ నడిచింది. తాజాగా భాగ్యరాజా ముందానై ముడిచ్చు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడని.. దానికోసం అనుష్క అయితే బావుంటుంది అని భాగ్యరాజా ప్రయత్నాలు చేస్తున్నాడని అంటున్నారు. భాగ్యరాజా 1983 లో తెరకెక్కించిన ముందానై ముడిచ్చు సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అయితే ఇన్నాళ్ళకి ఇప్పుడు భగ్యరాజా ముందానై ముడిచ్చు కి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడట. ముందానై ముడిచ్చు లో ఊర్వశి హీరోయిన్ గ నటించింది. ఇక ఇప్పుడు ఈ సీక్వెల్ కి అనుష్క హీరోయిన్ అయితే బావుంటుంది అని అనుకుని ఆమెని సంప్రదిస్తే అనుష్క నో చెప్పిందని టాక్ నడుస్తుంది. అయితే అనుష్క సినిమాలు ఒప్పుకోకపోవడానికి కారణం ఆమె జీవితంలో పెళ్లి చేసుకుని స్థిరపడాలని ఆలోచనలో ఉందేమో అంటున్నారు.

Tags:    

Similar News