స్వీటీ సినిమాలు వదలడం లేదు?

అనుష్క ఉరఫ్ స్వీటీ నిశ్శబ్దం సినిమా తర్వాత సినిమాలు ఆపెయ్యబోతుంది అనే ప్రచారం ఎప్పటినుండో జరుగుతుంది. ఇక నిశ్శబ్దంలో అనుష్క లుక్స్ ఆమె బరువు చూసాక నిశ్శబ్దంతో [more]

Update: 2020-10-05 06:42 GMT

అనుష్క ఉరఫ్ స్వీటీ నిశ్శబ్దం సినిమా తర్వాత సినిమాలు ఆపెయ్యబోతుంది అనే ప్రచారం ఎప్పటినుండో జరుగుతుంది. ఇక నిశ్శబ్దంలో అనుష్క లుక్స్ ఆమె బరువు చూసాక నిశ్శబ్దంతో అనుష్క కెరీర్ కి ఎండ్ కార్డు పడడం పక్కా అనుకున్నారు. కాదు అంటున్నారు. నిశ్శబ్దంసినిమాలో అనుష్క లుక్స్ పరంగాను బరువు పరంగాను చాల విమర్శలే ఎదుర్కొంది. ఇక సినిమాలో అంజలిని హైలెట్ చేస్తూ అనుష్క స్క్రీన్ స్పేస్ తగ్గింది. ఆ విషయంలో అనుష్క ఏం అనుకుందో తెలియదు కానీ.. వెబ్ మీడియా మాత్రం ఆ సినిమాలో అనుష్క కేరెక్టర్ గురించి ఉతికి ఆరేసింది. అయితే అనుష్క సినిమాలకు గుడ్ బై చెప్పబోతుందా అనే ప్రశ్నకి ఆమె ట్విట్టర్ లో ఇచ్చిన సమాధానంతో క్లారిటీ వచ్చింది. ఎప్పుడూ అభిమానులల్తో ఎప్పుడు చాట్ చెయ్యని అనుష్క తాజగా ట్విట్టర్ చాట్ లో అభిమానులల్తో ముచ్చటించింది.

ఓ అభిమాని అనుష్క ని ఉద్దేసించి మీరు బాగమతి, నిశ్శబ్దం సినిమాలు చాలా గ్యాప్ లు ఇచ్చి చేసారు.. మరి తర్వాతి ప్రాజెక్ట్స్ ని ఎప్పుడు ప్రకటిస్తారు అని అడగగానే దానికి అనుష్క త్వరలోనే చెబుతా అంటుంది. అంటే అనుష్క కథలు వింటూ సినిమాల ఒప్పుకోవడానికి రెడీగానే ఉందనిపిస్తుంది. ఇక అనుష్క ప్రాజెక్ట్స్ ని త్వరలోనే ఆయా నిర్మాణ సంస్థలు ప్రకటిస్తాయంటూ అభిమానులకి భరోసా ఇచ్చేసింది అనుష్క. ఇక నిశ్శబ్దంలో సాక్షి పాత్రని నటిగా నా పరిధి దాటి నటించేలా చేసిన పాత్ర అది.. ఆ పాత్ర చెయ్యడం సవాల్ తో కూడుకున్న పని.. ఆ పాత్రలో ఆల్ మ్యూట్ గా నటించడానికి ప్రత్యేక శిక్షణ తీసుకున్న అంటుంది. ఇక లాక్ డౌన్ లో అనుష్క జీవితాన్ని తెలుసుకున్నానని చెబుతుంది. మనం చుట్టూ ఉన్న పరిస్థితులు ఎల్లప్పుడూ మనం అనుకున్నట్టుగా ఉండవు, ప్రతి క్షణానికి, వ్యక్తికీ మనం విలువ నివ్వాలి అంటుంది స్వీట్ అనుష్క.

Tags:    

Similar News