అలాంటిదేం లేదు.. అవన్నీ అబద్దాలే!!

నిశ్శబ్దం మూవీని అనుష్క నిశ్శబ్దంగానే ముగించింది. అయితే నిశ్శబ్దం సినిమా ప్రమోషన్స్ విషయంలో అనుష్క అంటీముట్టనట్టుగా ఉంటుంది అని… తాజాగా నిశ్శబ్దం మూవీ విడుదలకు డేట్ వచ్చాకే.. [more]

Update: 2020-04-22 15:54 GMT

నిశ్శబ్దం మూవీని అనుష్క నిశ్శబ్దంగానే ముగించింది. అయితే నిశ్శబ్దం సినిమా ప్రమోషన్స్ విషయంలో అనుష్క అంటీముట్టనట్టుగా ఉంటుంది అని… తాజాగా నిశ్శబ్దం మూవీ విడుదలకు డేట్ వచ్చాకే.. కరోనా లాక్ డౌన్ వలన నిశ్శబ్దం వాయిదా పడడం, ఆ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో చెప్పలేని పరిస్తితుల్లో.. నిర్మాతలకు అప్పుల భారం పెరిగిపోతుంది అని.. అందుకే అమెజాన్ ప్రైమ్ ఇచ్చిన భారీ డీల్ కి నిశ్శబ్దం హక్కులు ఓటిటి కి అమ్మేద్దామని నిర్మాతలు మొత్తుకున్నప్పటికీ.. అనుష్క ససేమిరా అంటుందనే న్యూస్ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

కానీ తాజాగా ఆ న్యూస్ లన్ని అబద్ధాలని, మా నిశ్శబ్దం మూవీపై వస్తున్న రూమర్స్ ఏవి నిజాలు కావని, ఈ సినిమా మొదలైనప్పటినుండి.. ఇప్పటివరకు తమకు సహకారం అందిస్తున్న నటులతో పాటుగా టెక్నీషియన్స్ కి కృతజ్ఞతలు చెప్పిన నిర్మాతలు..అనుష్క కి స్పెషల్ గా థాంక్స్ చెబుతున్నారు. ఎందుకంటే కష్ట కాలంలో అనుష్క తమకి అండగా నిలిచింది అని… ఈ సినిమాపై ఎలాంటి రూమర్ వచ్చిన నమ్మొద్దూ అని.. త్వరలోనే సినిమా అప్ డేట్ ఇస్తామని, విడుదల డేట్ కూడా కన్ఫర్మ్ చేస్తామని సోషల్ ఇండియా వేదికగా నిశ్శబ్దం నిర్మాతలు చెబుతున్నమాట. 

Tags:    

Similar News