ఎప్పటిలాగే కిక్కెక్కిస్తుంది..!

అనుష్క పేరు గత రెండేళ్లలో సినిమాల విషయంలో పెద్దగా వినబడకపోయినా.. ఆమె బరువు తగ్గే విషయంలో ఎప్పటికప్పుడు మీడియాలో నానుతూనే ఉంది. బాహుబలి తర్వాత భాగమతితో అలరించిన [more]

Update: 2019-02-12 07:02 GMT

అనుష్క పేరు గత రెండేళ్లలో సినిమాల విషయంలో పెద్దగా వినబడకపోయినా.. ఆమె బరువు తగ్గే విషయంలో ఎప్పటికప్పుడు మీడియాలో నానుతూనే ఉంది. బాహుబలి తర్వాత భాగమతితో అలరించిన అనుష్క మళ్లీ మరో సినిమా చెయ్యలేదు. కారణం ఆమె అధిక బరువే. సైజ్ జీరో కోసం భారీగా బరువు పెరిగిన అనుష్క ఆ తర్వాత దాన్ని తగ్గించుకోవడానికి నానా తంటాలు పడింది. కానీ అనుష్క మాత్రం మునుపటి అందాన్ని చూపంచలేకపోయింది. గతంలో నాగార్జున, ప్రభాస్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో గ్లామర్ తో అదరగొట్టిన అనుష్కని అలా భారీ దేహంతో చూసిన అభిమానులు బాధపడ్డారు. ప్రభాస్ – అనుష్క, రవితేజ – అనుష్క, నాగార్జున – అనుష్క ఇలా మంచి మంచి హీరోల పక్కన హీరోయిన్ గా స్టార్ స్టేటస్ ఎంజాయ్ చెయ్యడమే కాదు లేడి ఒరింటెడ్ చిత్రాలైన అరుంధతి, రుద్రమదేవి, భాగుమతి సినిమాల‌తో సత్తా చాటింది.

మ‌ళ్లీ పాత అనుష్క క‌నిపించింది…

ఇక అనుష్కకి ఇప్పటికీ స్టార్ హీరోల రేంజ్ ఉన్నప్పటికీ ఆమె బరువు వలన ఆమెకి అవకాశాలు దూరమవడమో.. లేదంటే అనుష్కనే సినిమాలకు దూరంగా ఉందో కానీ… మధ్యమధ్యలో సెలబ్రిటీస్ పెళ్లిళ్లకు పద్దతిగా చీరకట్టులో వచ్చి మురిపించేది. ఇక బరువు తగ్గడం కోసం కొన్ని నెలలుగా కష్టపడుతున్న అనుష్కకి ఇన్నాళ్ల‌కి ఆమె కష్టానికి ఫలితం దక్కింది. అనుష్క ఈజ్ బ్యాక్ అన్న రేంజ్ లో అనుష్క మోహంలో కళతో పాటు ఆమె నాజూకు తనం తిరిగొచ్చాయి. ప్రస్తుతం అనుష్క కొత్త లుక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బాహుబలిలో భారీగా కనబడిన అనుష్క మళ్లీ ఇంత‌ నాజూకైన అందంతో అదరగొట్టేసింది అంటారు.

Tags:    

Similar News