అనుష్క కష్టాలు తీరినట్లే!!

భాగమతి తర్వాత కనబడకుండా వెళ్లిన అనుష్క నిశ్శబ్దం సినిమాతో లైన్ లోకొచ్చింది. అనుష్క బరువు పెరగడంతో.. ఆమెకి ఆఫర్స్ రాలేదో.. వచ్చిన రిజెక్ట్ చేసిందో తెలియదు కానీ… [more]

Update: 2020-02-24 10:54 GMT

భాగమతి తర్వాత కనబడకుండా వెళ్లిన అనుష్క నిశ్శబ్దం సినిమాతో లైన్ లోకొచ్చింది. అనుష్క బరువు పెరగడంతో.. ఆమెకి ఆఫర్స్ రాలేదో.. వచ్చిన రిజెక్ట్ చేసిందో తెలియదు కానీ… సినిమాలుకు అందుకే బ్రేక్ ఇచ్చేసింది. అయితే ఒకప్పుడు నయనతార కి పోటీగా అనుష్క తయారవుతుంది అనుకుంటే.. ఆమె సైజు జీరో సినిమా ఆమెని సినిమాలకు గ్యాప్ ఇచ్చేలా చేసింది. అధిక బరువుతో సినిమాలు చెయ్యకుండా సైలెంట్ అయిన అనుష్క ఇప్పుడు కాస్త బరువు తగ్గింది. అందరిలా కాకుండా నేచురల్ గా బరువు తగ్గినా అనుష్క అందం కూడా రెట్టింపు అయ్యింది. అయితే అనుష్క నిశ్శబ్దం సినిమాతో మళ్ళీ ప్రేక్షకులముందు వస్తుంది అనుకుంటే.. నిశ్శబ్దం సినిమా ని సైలెంట్ గా వదిలేసి నాని హిట్ సినిమా ప్రమోషన్స్ లో అనుష్క స్పెషల్ గా పాల్గొంది. హిట్ ఈవెంట్ లో అనుష్క నే హైలెట్ అనేలా ఉంది.

అందంతో మెరిసిపోతున్న అనుష్క ని అలా చూడగానే అబ్బా అనుష్క మళ్ళీ మునుపుటిల తయారైంది అని అనకుండా ఉండలేం. మునుపుటి షేప్ కాకపోయినా అనుష్క అందం మాత్రం అదిరింది అనే చెప్పాలి. హిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏమో గాని అన్సారీ చూపు అనుష్క మీదే. చానళ్లకు అనుష్క అలా ట్రెడిషనల్ గా అచ్చం దేవతలా కనిపించడంతో ఆమె అభిమానుల అందడానికి అవధుల్లేవ్. మొన్నామధ్యన అనుష్క ఎయిర్ పోర్ట్ లో లుక్ అని కాస్త బరువున్న అనుష్క ఫోటో కనబడేసరికి అందరిలో అనుష్క మీద అనేక అనుమానాలు. కానీ హిట్ ఫంక్షన్ లో అనుష్క మీదున్న అపోహలన్నీ తొలగిపోయాయి.

Tags:    

Similar News