అనుష్క ని బాగానే వాడుకుంటున్నారు..!

భాగమతి మూవీ తరువాత అనుష్క చాలా గ్యాప్ తీసుకుని చేస్తున్న చిత్రం సైరా. అయితే ఇందులో ఈమె ఫుల్ లెంగ్త్ పాత్రలో యాక్ట్ చేయట్లేదు. ఒక కీలక [more]

Update: 2019-05-24 07:57 GMT

భాగమతి మూవీ తరువాత అనుష్క చాలా గ్యాప్ తీసుకుని చేస్తున్న చిత్రం సైరా. అయితే ఇందులో ఈమె ఫుల్ లెంగ్త్ పాత్రలో యాక్ట్ చేయట్లేదు. ఒక కీలక పాత్ర చేస్తునట్టు గత కొన్ని రోజుల నుండి వార్తలు వస్తున్నాయి. ఈ పాత్ర చాలా ప్ర‌త్యేకంగా ఉంబోతోంద‌ని, స్వీటీ మ‌రింత గ్లామ‌రెస్‌గా క‌నిపించ‌బోతోంద‌ని టాక్‌. ఇప్పటికే ఇందులో న‌య‌న‌తార‌, త‌మ‌న్నా నటిస్తున్నారు. ఇప్పుడు అనుష్క కనిపించబోతుంది. ఈ వారంలోనే అనుష్క ‘సైరా’ సెట్లో అడుగుపెట్ట‌బోతోంది. అనుష్క‌పై స‌న్నివేశాల్ని తెర‌కెక్కిస్తే… ‘సైరా’ షూటింగ్ దాదాపుగా పూర్త‌యిన‌ట్టే.

ఓ పాటలో కూడా అనుష్క

అయితే ఈమెను మొదట కొన్ని సీన్స్ కోసమే తీసుకున్నారు కానీ ఇప్పుడు ఓ పాట‌లో కూడా అనుష్క‌ని వాడుకోవాల‌ని చిత్ర‌బృందం భావిస్తోంది. త్వరలోనే ఆ సాంగ్ కూడా షూట్ చేయనున్నట్టు చెబుతున్నారు. ఆల్రెడీ సైరా చిత్రం టాకీ పార్ట్ పూర్తయింది. ప్యాచ్ వర్క్ తప్ప. అక్టోబ‌రులోనే ఈ చిత్రాన్ని విడుద‌ల చేయాల‌న్న‌ది చిరంజీవి ఆలోచ‌న‌. ఇక ఇందులో అమితాబ్ బచ్చన్ తో పాటు సుదీప్, విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించనున్నారు.

Tags:    

Similar News