కార్తికేయ పెళ్లిలో కొత్త అనుష్క..?

Update: 2018-12-20 07:47 GMT

భాగమతి, బాహుబలి సినిమాల తర్వాత అనుష్క మళ్లీ సినిమాల్లో కనిపించలేదు. బరువు కారణంగా సినిమాలకు దూరమైన అనుష్క నిధానంగా సినిమాలకు సైన్ చేస్తుంది. సైలెన్స్ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాతో మళ్లీ సెట్స్ మీదకెళ్లబోతుంది. అయితే సైజు జీరో బరువుని తగ్గించుకోవడానికి నానా అవస్థలు పడుతున్న అనుష్క ప్రస్తుతం బరువు తగ్గిందనే న్యూస్ స్ప్రెడ్ అయ్యింది. మునుపటి అనుష్కలా మళ్లీ బరువు తగ్గిపోయిన అనుష్క కొత్త లుక్ తో దర్శనమీయబోతుందట. ఏ పార్టీకి, ఏ ఫంక్షన్ కి వెళ్లినా అనుష్క చుడీదార్స్ లో, శారీస్ లోనే కాస్త బరువుతోనే కనబడేది. మరి బరువు తగ్గడానికి అనేక ఆయుర్వేద పద్దతులను ట్రై చేసిన అనుష్క ఫైనల్ గా బరువుని ఒక కొలిక్కి తీసుకొచ్చిందట.

కొత్త లుక్ లో దర్శనమిస్తుందా..?

అయితే అప్పుడే మనం అనుష్కని కొత్త అంటే సన్నని లుక్ లో చూడలేము కానీ... మరికొద్ది రోజుల్లో జరగబోయే రాజమౌళి కొడుకు కార్తికేయ పెళ్లిలో మాత్రం కొత్త అనుష్కని చూడబోతున్నామట. మరి జక్కన్నతో అనుష్కకు బాహుబలి బంధమే కాదు.. గతంలో విక్రమార్కుడు వంటి సినిమాలోనూ నటించింది. సైజు జీరో వలన పెరిగిన బరువుతోనే బాహుబలి 2లో కనబడిన అనుష్క ఇప్పుడు తన కొత్త లుక్ ని మనం కార్తికేయ వెడ్డింగ్ లో చూడబోతున్నాం. మరి ఈ నెల 31న జరగబోయే రాజమౌళి తనయుడి పెళ్లికి అనుష్క మాత్రమే కాదు. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ అగ్రతారలు హాజరవనున్నారు. మరి కార్తికేయ పెళ్లిలో మెరవబోయే ఆ తారల ఫొటోస్, వీడియోస్ కోసం అప్పుడే ప్రేక్షకులు అత్యంత ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.

Similar News