స్లిమ్ లుక్ తో మన్మదుడికి గాలం వేస్తుందా..?

హీరోయిన్ అనుష్కకి నాగార్జున అంటే ఎనలేని అభిమానం. ఎందుకంటే కెరీర్ తొలినాళ్లలో నాగార్జున అనుష్కకి సపోర్ట్ గా నిలిచాడు నాగ్. అందుకే అనుష్కతో నాగ్ చాలా సినిమాలే [more]

Update: 2019-02-16 08:11 GMT

హీరోయిన్ అనుష్కకి నాగార్జున అంటే ఎనలేని అభిమానం. ఎందుకంటే కెరీర్ తొలినాళ్లలో నాగార్జున అనుష్కకి సపోర్ట్ గా నిలిచాడు నాగ్. అందుకే అనుష్కతో నాగ్ చాలా సినిమాలే చేసాడు. అనుష్క కూడా నాగ్ సినిమాలు చాలా వాటిలో గెస్ట్ రోల్స్ కూడా ప్లే చేసిన విషయం తెలిసిందే. అలాగే నాగ్ కుటుంబానికి అనుష్క చాలా క్లోజ్ కూడా. ఇకపోతే గత కొన్నాళ్లుగా అనుష్క అధిక బరువుతో బాధపడుతూ.. లేటెస్ట్ గా స్లిమ్ లుక్ కి మారింది. ఆయుర్వేద వైద్యంతో అనుష్క టోటల్ స్లిమ్ లుక్ లోకి వచ్చేసింది. ప్రస్తుతం అనుష్క స్లిమ్ లుక్ తో మన్మధుడికి గాలం వేసిందనే టాక్ నడుస్తుంది. నాగార్జున.. మన్మధుడు సినిమాని రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో సీక్వెల్ చేస్తున్న విషయం తెలిసిందే. మన్మధుడు సినిమాలో సోనాలి బింద్రే, అన్షుతో రొమాన్స్ చేసిన నాగార్జున.. మన్మధుడు 2లో ఇప్పటికే పాయల్ రాజపుట్ ని ఎంపిక చేసారని ఇప్పుడు అనుష్కని కూడా సంప్రదిస్తున్నట్లుగా చెబుతున్నారు.

ఒప్పేసుకుందట…

అయితే నాగార్జున ఆఫర్ చేస్తే అనుష్క కచ్చితంగా ఒప్పుకుంటుంటుందనే టాక్ నడుస్తుంది. అయితే కేవలం సంప్రదింపుల వరకే కాదు… అనుష్కని సంప్రదించడం.. ఆమె ఒకే చెప్పడం జరిగిందని.. అసలు ఇప్పటికే అనుష్క ఫోటో షూట్ కూడా జరిగిందని అంటున్నారు. మరి ఇందులో నిజమెంతుంది అనేది అధికారిక ప్రకటన వచ్చే వరకు తెలియదు. కాకపోతే నాగ్ – అనుష్క లు కలిసి నటిస్తే మాత్రం మన్మధుడు సినిమాకి క్రేజ్ రావడం పక్కా కాబట్టి అనుష్కకి నాగ్ ఆఫర్ నిజమే అయ్యుంటుందని అంటున్నారు.

Tags:    

Similar News