సైరా కోసం దేవసేన వస్తుందా..?

చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డి సినిమా షూటింగ్ ఎడతెగకుండా జరుగుతూనే ఉంది. ఈ సినిమాలో చిరు సరసన నయనతార, తమన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అయితే [more]

Update: 2019-02-04 05:21 GMT

చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డి సినిమా షూటింగ్ ఎడతెగకుండా జరుగుతూనే ఉంది. ఈ సినిమాలో చిరు సరసన నయనతార, తమన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అయితే సినిమా మొదలైనప్పుడు మరో హీరోయిన్ క్యారెక్టర్ కూడా ఉంటుందని… దాని కోసం ప్రజ్ఞ జైస్వాల్ ని తీసుకున్నారనే ప్రచారం జరిగింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సైరాలో అతి కీలకమైన ఆ హీరోయిన్ పాత్ర కోసం బాహుబలి దేవసేన అనుష్కని సంప్రదించినట్టుగా ఒక వార్త ఫిలిం సర్కిల్స్ లో హల్ చల్ చేస్తుంది.

స్వయంగా మాట్లాడి ఒప్పించిన చరణ్

బాహుబలిలో దేవసేనగా ప్రేక్షకుల మనస్సులు దోచేసిన అనుష్క కూడా సైరా సినిమాలో భాగమైతే ఆ సినిమా క్రేజ్ మరింత పెరుగుతుందనడంలో సందేహం లేదు. కానీ బాహుబలి తర్వాత అనుష్క అధిక బరువు వల్ల సినిమాలేవీ ఒప్పుకోవడం లేదు. రీసెంట్ గా సైలెన్స్ అనే మూవీ ఒప్పుకున్నా అది ఇంకా సెట్స్ మీదకెళ్లలేదు. అయితే సైరాలో కాస్త బరువున్న హీరోయిన్ నటించాల్సిన పాత్రకే అనుష్కని దర్శకుడు సురేందర్ రెడ్డి, నిర్మాత రామ్ చరణ్ అనుకున్నారట. అందుకే చరణ్ స్వయంగా అనుష్కతో మాట్లాడి ఆమెను ఒప్పించినట్టుగా ఫిలిం నగర్ టాక్.

Tags:    

Similar News