అందుకే అనుష్క అక్కడికి వెళ్లింది..!

Update: 2018-10-10 07:00 GMT

అనుష్క 'భాగమతి' సినిమా తర్వాత ఏ సినిమాలోను కనిపించలేదు. ఆ మధ్య ఓ కొత్త డైరెక్టర్ చెప్పిన కథకు ఇంప్రెస్స్ అయ్యి ఆ ప్రాజెక్ట్ కు ఓకే చెప్పిందని సమాచారం. అయితే అది సెట్స్ మీదకు ఇంతవరకు వెళ్లలేదు. ఇది ఇలా ఉండగా 'సైజ్ జీరో' సినిమా కోసం అవసరానికి మించి బరువు పెరిగిన అనుష్క ఆ బరువు తగ్గేందుకు చాలానే కష్టపడుతుంది. జిమ్ కి వెళ్లి వర్కవుట్స్ చేస్తుందని.. త్వరలోనే ఫిట్ గా తయారై దర్శనం ఇవ్వనుందని చెప్పారు. కానీ అవన్నీ నిజాలు కావని తన సన్నిహితులు చెబుతున్న మాట. మరి సినిమాల కోసమో... లేదా పెళ్లి కోసమో అనుష్క బరువు తగ్గాలని గట్టిగా డిసైడ్ అయిందంట.

పెళ్లి కోసమా..? సినిమా కోసమా..?

ఈ నేపథ్యంలో తన ఫ్రెండ్ సలహా మేరకు ఆస్ట్రియా వెళ్లిందట. అక్కడ సహజమైన ప్రకృతి పద్ధతుల ద్వారా బరువును తగ్గించే క్లినిక్ ఒకటి ఉందట. బాలీవుడ్ నుండి చాలామంది అక్కడికి వెళ్లి బరువు తగ్గి వచ్చారట. అందుకే అనుష్క కూడా అక్కడ వెళ్లిందని చెబుతున్నారు. 37 ఏళ్లు ఉన్న అనుష్క దగ్గర పెళ్లి మాట ఎత్తగానే చాలా సందర్భాల్లో దాటివేస్తూ వచ్చింది. గత కొంత కాలం నుండి ప్రభాస్ - అనుష్కలు పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. మరి అందులో ఎంతవరకు నిజముందో తెలియని అయోమయంలో అభిమానులు ఉన్నారు. కొరటాల డైరెక్షన్ లో చిరంజీవి ఓ సినిమాలో నటించబోతున్నాడు. ఇందులో ఒక హీరోయిన్ గా తమన్నా, మరో హీరోయిన్ గా అనుష్క సెలెక్ట్ అయినట్టు సమాచారం. మరి అనుష్క సినిమాల కోసం బరువు తగ్గుతుందా..? లేదా..? పెళ్లి కోసం తగ్గుంతుందా అనేది తెలియాల్సి ఉంది. ఏది అయితేనేం బరువు తగ్గటం అనేది ఆరోగ్యనికి మంచిదేగా.

Similar News