అనుష్క మళ్ళీ లేడి ఓరియెంటెడ్ పాత్రలోనే?

Update: 2018-07-24 07:11 GMT

తెలుగులో లేడీ ఓరియెంటెడ్ పాత్రలకు పెట్టింది పేరు అనుష్కనే. అరుంధతి, రుద్రమదేవి, భాగమతి...ఇలా దేనికదే అనుష్క కెరీర్ లో సరైన పాత్రలు. అందుకే లేడి ఓరియెంటెడ్ పాత్రలనగానే అందరూ అనుష్కనే చూస్తారు. గతంలో అయితే హీరోయిన్ గా టాప్ పొజిషన్ లో ఉన్న విజయశాంతి లేడీ ఓరియెంటెడ్ పాత్రలు అదరగొట్టేది. ఇక ఇప్పుడు మాత్రం అనుష్క నే బెస్ట్ ఆప్షన్ గా ఉంది. కానీ అనుష్క బాహబలి, భాగమతి సినిమాల తర్వాత మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా సైలెంట్ గా ఉంది. మరి అలా సైలెంట్ గా ఉన్న అనుష్క ఇప్పుడు మరో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాని ఒప్పుకుందని ఫిలిం నగర్ టాక్.

లేడీ ఓరియెంటెడ్ కావడంతోనే...

డెబ్యూ డైరెక్టర్ హేమంత్... హీరోయిన్ ఓరియెంటెడ్ కథ అనుష్క కి వినిపించగా... కథ నచ్చి ఈ సినిమాని అనుష్క ఒకే చేసినట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం హీరోల పక్కన నటించే కన్నా ఇలా లేడి ఒరింటెడ్ పాత్రలనే ఒప్పుకోవాలని అనుష్క ఆలోచనగా చెబుతున్నారు. అందుకే ఎంతమంది హీరోల సరసన అవకాశం వచ్చినా.. అనుష్క ఒప్పుకోలేదని.. కానీ ఇప్పుడు కథానాయిక ప్రాధాన్యం ఉన్న పాత్ర రావడంతోనే అనుష్క ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే టాక్ నడుస్తుంది. ఇప్పటికే అనుష్క గ్రీన్ సిగ్నల్ తో కోన కార్పొరేషన్ - పీపుల్స్ మీడియా వారు కలసికట్టుగా ఈ సినిమాని నిర్మించడానికి రెడీ అవుతున్నారని అంటున్నారు.

హీరోల పక్కన నటించే ఆసక్తి లేదా..?

మరి నిజంగానే అనుష్క గనక ఈ సినిమా చేస్తే... ఆమెకి స్టార్ హీరోల పక్కన నటించే ఇంట్రెస్ట్ తగ్గిందా...లేదంటే అనుష్కకి అవకాశాలు రాక అలా సినిమాలు చెయ్యడం లేదా అనేది కూడా క్లారిటీ రావాలి. ఏది ఏమైనా భాగమతి తరవాత అనుష్క నటించబోయేది హేమంత్ డైరెక్షన్ లోనే అంటున్నారు. ఇక ఈ సినిమాలో మరో కీలక పాత్రకి మాధవన్ ని ఎంపిక చెయ్యగా... నాని స్పెషల్ రోల్ చేస్తున్నట్టుగా కొన్ని వార్తలు సోషల్, వెబ్, ప్రింట్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

Similar News