ట్రోలింగ్ కి భయపడి మాతృభాషకు దూరమయ్యా?

ఏ హీరోయిన్ అయినా ముందు మాతృ భాషలోనే లక్కుని పరీక్షించుకున్నాకే తర్వాత మిగతా భాషల వైపుకి వెళుతుంది. తెలుగులో క్రేజ్ సంపాదించలేనివారు.. తమిళ, కన్నడ ఇండస్ట్రీస్ లో [more]

Update: 2020-08-06 13:45 GMT

ఏ హీరోయిన్ అయినా ముందు మాతృ భాషలోనే లక్కుని పరీక్షించుకున్నాకే తర్వాత మిగతా భాషల వైపుకి వెళుతుంది. తెలుగులో క్రేజ్ సంపాదించలేనివారు.. తమిళ, కన్నడ ఇండస్ట్రీస్ లో సినిమాలు చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ మాతృ భాషకు దూరమై తెలుగు, తమిళ, కన్నడ సినిమాలు చెయ్యడానికి గల కారణాలు చెబుతుంది. తెలుగులో ఉన్నది ఒకటే జిందగీ, హలొ గురు ప్రేమకోసమే, తేజ్ ఐ లవ్ యు, శతమానంభవతి సినిమాల్లో నటించి ట్రెడిషనల్ గర్ల్ అనుపమ పరమేశ్వరన్ ముందు మళయాళంలోనే కెరీర్ ఆరంభించింది. ప్రేమమ్ సినిమాతో వెండితెరకు పరిచయమైన అనుపమ పరమేశ్వరన్ ఆ సినిమా తర్వాత మలయాళంలో ఒకే ఒక్క సినిమా చేసింది.

తర్వాత మలయాళంలో కాకుండా తెలుగు, తమిళ, కన్నడ సినిమాలకు పరిమితమై మలయాళం వైపు చూడలేదు. దానికి కారణం ట్రోలింగ్ అని చెబుతుంది. ప్రేమమ్ సినిమా చేసేటప్పుడు తాను చాలా చిన్న పిల్లని అని, ఆ సినిమా చేసాక ప్రమోషస్న్ లో భాగంగా ఇంటర్వూస్ లో నా కేరెక్టర్ గురించి గొప్పగా మాట్లాడేసాను, అసలు ప్రెస్ మీట్స్ లో, మీడియా తో సమాధానాలు కూడా ఏవేవో చెప్పేశాను. తీరా చూస్తే… ప్రేమమ్ సినిమాలో నాది చాలా చిన్న క్యారెక్టర్. దాంతో అందరూ నన్ను సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మొదలెట్టారు. అందుకే బాగా అప్ సెట్ అయిన నేను మలయాళంలో సినిమాలు చెయ్యలేదు. మలయాళ సినిమాలకి దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడంతో మలయాళంలో వచ్చిన ఆఫర్స్ ని వదిలేసుకున్నాను అని చెబుతుంది అనుపమ పరమేశ్వరన్. 

Tags:    

Similar News