గ్లామర్ గా చెయ్యను అంటే… ఇలా ఖాళీ అవ్వాలి

ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెడితే… గ్లామర్ అయినా ఉండాలి, లేదంటే లక్కయిన ఉండాలి. సాయి పల్లవి లాంటి హీరోయిన్స్ గ్లామర్ షో చెయ్యనని చెప్పినా.. ఆమెకున్న డాన్స్, [more]

Update: 2019-11-15 02:18 GMT

ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెడితే… గ్లామర్ అయినా ఉండాలి, లేదంటే లక్కయిన ఉండాలి. సాయి పల్లవి లాంటి హీరోయిన్స్ గ్లామర్ షో చెయ్యనని చెప్పినా.. ఆమెకున్న డాన్స్, నటన టాలెంట్ తో వరస అవకాశాలు వస్తూనే ఉన్నాయి. కానీ అనుపమ పరమేశ్వరన్ లాంటి హీరోయిన్స్ గ్లామర్ షో చెయ్యను అంటే సినిమాలు లేక ఖాళీ అవ్వాల్సిందే. అనుపమ పరమేశ్వరన్ ఇప్పటికే చాలా సినిమాలు చేసినా.. ఎందులోనూ గ్లామర్ షో చెయ్యలేదు. పొట్టి పొట్టి బట్టలు వేసుకోలేదు, క్లివేజ్ షో చెయ్యలేదు. ఎప్పుడూ ట్రెడిషనల్ గానే కనబడుతుంది అనుపమ.

అయితే అనుపమ పరమేశ్వరన్ కూడా తాను గ్లామర్ షో కి పనికిరానని, పొట్టి పొట్టి బట్టలు తనకి నప్పవని చెబుతుంది. అందుకే గ్లామర్ షో కి దూరమని చెబుతున్న ఈ చిన్నదానికి చీరలు, చుడీదార్స్ లాంటివే బావుంటాయట. మరి రాక్షసుడు హిట్ వచ్చినా అనుపమకు మరో తెలుగు సినిమా తగల్లేదు. కారణం అనుపమ పరమేశ్వరం గ్లామర్ షో చెయ్యకపోవడం ఒకటయితే… ఆమెకి లక్కు లేకపోవడం మరో కారణమనే చెప్పాలి. లేదంటే శతమానం భవతి, హలొ గురు ప్రేమ కోసమే, ఉన్నది ఒకటే జిందగీ లాంటి మంచి సినెమాలున్నప్పటికీ.. ఆనుపకి అవకాశాలు లేవంటే ఏమనుకోవాలి.

Tags:    

Similar News