మూడు పూటలా బిర్యానీ తినమన్నా తింటా అంటున్న హీరోయిన్?

అందం ఉంది, నటన ఉంది అయినా గ్లామర్ తక్కువైందన్న కారణంగా అనుపమ పరమేశ్వరన్ కి అవకాశాలు రావడం లేదు. రాక్షసుడు లాంటి హిట్ ఉన్నప్పటికీ.. అమ్మడుకి మాత్రం [more]

Update: 2020-01-11 05:52 GMT

అందం ఉంది, నటన ఉంది అయినా గ్లామర్ తక్కువైందన్న కారణంగా అనుపమ పరమేశ్వరన్ కి అవకాశాలు రావడం లేదు. రాక్షసుడు లాంటి హిట్ ఉన్నప్పటికీ.. అమ్మడుకి మాత్రం అవకాశాలు తగలడం లేదు. ప్రస్తుతం తెలుగులో ఖాళీగా కనబడుతున్న అనుపమకు ఇష్టమైనవి రెండే రెండట. అవి సినిమాలు, ఫుడ్. మరి చేతిలో సినిమాలు ఉంటే షూటింగ్ చెయ్యడం లేదంటే.. సినిమాలు చూడడం అనుపమ పరమేశ్వరన్ హాబీ అట. ఇంకా సంగీతం అంటే ఇష్టమని, పాటల్ని వింటుంటా అని చెప్పిన అనుపమకు ఎవరి జీవిత కథ అయినా తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుందట. ఎందుకంటే వారు సాధికఞ్హిన విజయాలతో స్ఫూర్తి పొందొచ్చు కదా అంటుంది.

ఇక తనకు ఫుడ్ చాలా ఇష్టమని అందులో బిర్యానీ అంటే ఇంకా ఇష్టమని చెప్పిన అనుపమ మూడు పూటలా బిర్యానీ ఉంటే తినేస్తా అంటుంది. అందుకే తన ఫ్రెండ్స్ అంతా తనని బిర్యానీ పిచ్చిది అంటూ ఆటపట్టిస్తారని చెబుతుంది. ఇక షూటింగ్ ల కోసం వివిధరకాల ప్లేస్ లకి వెళ్లి నప్పుడు అక్కడ రకరకాల రుచులను ఆస్వాదించవచ్చని చెబుతుంది. ఇక ఎక్కడికి వెళ్లినా అందరూ హైదరాబాద్ బిర్యాని అంటే ఫెమస్ కదా అని అడుగుతుంటే చాల గర్వంగా అనిపిస్తుంది అని చెబుతుంది ఈ క్యూట్ గర్ల్ అనుపమ.

Tags:    

Similar News