అన్ను బేబీ ఎక్కడ..?

Update: 2018-11-27 08:30 GMT

అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఉన్నది ఒకటే జిందగి, కృష్ణార్జున యుద్ధం, తేజ్ ఐ లవ్ యూ... నిన్న గాక మొన్న హలో గురు ప్రేమ కోసమే చిత్రాలలో తేజ్ ఐ లవ్ యూ డిజాస్టర్ కాగా మిగతా మూడు సినిమాలు యావరేజ్ గా నిలిచాయి. అయితే ఈ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన అనుపమ పరమేశ్వరన్ ఒకప్పుడు టాప్ స్టార్స్ పక్కన సినిమాలు చేస్తూ బిజీ అవుతుంది అనుకుంటే.. ప్రస్తుతం యావరేజ్ హీరోల పక్కన కూడా అవకాశాలు లేక గిలగిలలాడుతోంది. ట్రెడిషనల్ లుక్స్ తో, సొంత గొంతుతో, నటనలో మంచి ఈజ్ ఉన్న అనుపమ పరమేశ్వరన్ కి అదృష్టం కలిసి రావడం లేదు. అందుకే వరుసగా సినిమాలన్నీ ఫ్లాప్ అవుతున్నాయి. ఇక అనుపమకు అసలు ఒక్క టాప్ స్టార్ నుండి కూడా అవకాశం రాలేదు. అప్పట్లో రంగస్థలంలో అనుపమకు అవకాశం వచ్చిందనే ప్రచారం జరిగినా ఎందుకో అనుపమ దాన్ని వదిలేసుకుంది.

రష్మిక ఓ వైపు దూసుకుపోతుంటే...

ఇక హలో గురు ప్రేమ కోసమే సినిమా హిట్ అయినా అనుపమ పరమేశ్వరన్ కి అవకాశాలు తగిలేవి. కానీ ఆ సినిమా కూడా ఫ్లాప్ అవడంతో ప్రస్తుతం అనుపమ చేతిలో ఒక్క ప్రాజెక్ట్ కూడా లేకుండా పోయింది. ఒక్క దర్శక నిర్మాత కూడా అనుపమ వైపు కన్నెత్తి చూడడం లేదు. ప్రస్తుతం యావరేజ్ ఉన్న ఈ హీరోయిన్ ని పెట్టుకుంటే... తమ సినిమాకి క్రేజ్ రాదనే భావనలో ఉన్నారు. కాగా కన్నడలో మాత్రం ఒకే ఒక్క సినిమా చేస్తుంది. మరి మలయాళం నుండి దూసుకొచ్చిన అనుపమకు మాతృ భషలోనూ పెద్దగా అవకాశాలు లేవు. ఇక నిన్నగాక మొన్నొచ్చిన కన్నడ భామ రష్మిక అవకాశాలతో, సినిమా హిట్స్ తో దూసుకుపోతుంటే... అన్నీఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా ఉంది ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్ వ్యవహారం.

Similar News