గడ్డుకాలమే ఇక!!

Update: 2018-05-05 03:43 GMT

పాపం ఎన్ని అందాలు ఆరబోసినా హీరోయిన్స్ కి ఒక్క సినిమా ప్లాప్ పడింది అంటే ఆ హీరోయిన్ కి మరో అవకాశం రావడానికి చాలా టైం పట్టేస్తుంది. మజ్ను, కిట్టు వున్నాడు జాగ్రత్త సినిమా లో యావరేజ్ హిట్ అందుకున్న అను ఇమాన్యువల్ కి బిగ్ ప్రాజెక్ట్ త్రివిక్రమ్ - పవన్ కళ్యాణ్ కాంబో లో అజ్ఞాతవాసిలో అవకాశం రావడంతో అమ్మడు ఎగిరి గంతేసింది. అయితే అందులో అను ఇమ్మాన్యువల్ కి అస్సలు ప్రాధాన్యత లేని పాత్ర. కేవలం పవన్ కళ్యాణ్ తో సినిమా అనగానే ఒప్పుకుందో ఏమో కానీ... ఆ సినిమా లో అను అందాల ఆరబోతకు తప్ప ఎందుకు పనికిరాలేదు. ఆ సినిమా డిజాస్టర్ తోనే అమ్మడు పనైపోయింది.

లక్కీగా ఛాన్స్ వచ్చినా.....

కానీ అజ్ఞాతవాసి సినిమా విడుదలకముందే లక్కీగా అల్లు అర్జున్ నా పేరు సూర్య లో అవకాశం పట్టేసింది. ఇక ఈ సినిమాతో పాటుగా మరో రెండు భారీ ప్రాజెక్ట్ లలో అమ్మడుకి ఛాన్స్ వచ్చినట్టే వచ్చి మిస్ అయ్యింది. అయితే అను మాత్రం అల్లు అర్జున్ నా పేరు సూర్య మీదే ఎక్కువగా నమ్మకం పెట్టుకుంది. అయితే అను ఇమ్మాన్యువల్ కి నా పేరు సూర్య కూడా నిరాశనే మిగిల్చింది.ఈ సినిమా లో అను కి ఏ మాత్రం ప్రాధాన్యత లేని పాత్ర దక్కడం, కేవలం పాటలకే పరిమితమవుతూ గ్లామర్ షో చెయ్యడానికి ఎందుకు పనికిరాలేదు. ఈదెబ్బకి అను కి మాత్రం దిమ్మతిరిగినట్టే అనిపిస్తుంది.

సూర్య దెబ్బేసిందే.....

ఈ సినిమా తో అయినా హిట్ అందుకుని హీరోయిన్ గా పదికాలాలు రాజ్యమేలుదామంటే మాత్రం నాపేరు సూర్య కూడా అనుకి దెబ్బేసింది. ఇక నా పేరు సూర్య విడుదల కాకముందే... అను కి నాగ చైతన్య - మారుతీ ల శైలజ రెడ్డి అల్లుడు సినిమా లో ఛాన్స్ వచ్చింది. మరి అమ్మడుకి ఆ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో తెలియదు గాని... అజ్ఞాతవాసి, నా పేరు సూర్య దెబ్బకి స్టార్ హీరోల సినిమా ల్లో మాత్రం అవకాశాలు వచ్చే ఛాన్స్ మాత్రం లేదనిపిస్తుంది. మరి అనుకి ఈ దెబ్బతో ఇక గడ్డుకాలం స్టార్ట్ అయ్యిందని చెప్పాలి.

Similar News