అను బంపర్ ఆఫర్ కొట్టేసింది!

Update: 2018-08-29 08:04 GMT

తెలుగులో “మజ్ను” సినిమాతో వెండి తెరకు పరిచయం అయినా నటి అను ఇమ్మానుయేల్.. కేవలం ఒకేఒక్క సినిమాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పక్కన త్రివిక్రమ్ డైరెక్షన్ లో 'అజ్ఞాతవాసి' సినిమాతో బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఆ తర్వాత చేసిన అల్లు అర్జున్ “నాపేరుసూర్య” సినిమాతో డిజాస్టర్ అందుకుంది.ఎన్నో అంచనాలు మధ్య రిలీజ్ అయినా ఈ సినిమా ప్లాప్ అవ్వడంతో అను నిరాశ గురైంది. కానీ తమిళంలో ఈ సినిమాకు మంచి టాకే వచ్చింది. ఇక తమిళంలో ఆమె నటించిన “తుప్పారివాల‌న్‌” తెలుగులో “డిటెక్టివ్ ” గా వచ్చింది. ఆ సినిమా తెలుగులో మంచి టాక్ అందుకుంది. తన నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి.

మంచి బ్రేక్ వస్తుందని......

ప్రస్తుతం ఆమెకు తమిళంలో విజయ్ సేతుపతికి జోడిగా నటించే అవకాశం వచ్చిందంట. తమిళంలో విజయ్ సేతుపతి మంచి క్రేజ్ ఉండటంతో ఆమె ఏమి ఆలోచించకుండా ఆ సినిమాకి ఓకే చెప్పేసిందని టాక్. ప్రస్తుతం అను తెలుగులో “శైలజారెడ్డి అల్లుడు” వచ్చే నెల సెప్టెంబర్ 13 న విడుదల అవ్వబోతుంది. ఈసినిమాతో తనకు తెలుగులో మంచి బ్రేక్ వస్తుందని అను ఆశిస్తుంది. మరి ఈమూవీతో ఆమె ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

Similar News