అనుకి అగ్ని పరీక్ష!!

Update: 2018-05-04 04:36 GMT

అజ్ఞాతవాసి సినిమాలో కేవలం గ్లామర్ షో కి తప్ప నటనకు ఏ మాత్రం ఆస్కారం లేని పాత్రలో నటించిన అను ఇమ్మాన్యువల్ అందాల ఆరబోతలో మాత్రం తగ్గేది లేదంటుంది. అజ్ఞాతవాసిలో... అను ఇమ్మాన్యువల్, పవన్ కళ్యాణ్ మీద మీద పడడం తప్ప చేసిందేమి లేదు. ఆ సినిమా ఇంకా సెట్స్ మీదుండగానే అనుకి మెగా హీరో అల్లు అర్జున్ నా పేరు సూర్య లో అవకాశం వచ్చింది. అయితే అజ్ఞాతవాసి సినిమా ప్లాప్ తో అను ఇమ్మాన్యువల్ క్రేజ్ కాస్త తగ్గిందనే చెప్పాలి. ఎందుకంటే నా పేరు సూర్య తర్వాత నాగ చైతన్య తో ఒక్క సినిమా తప్ప అను చేతిలో మరే సినిమాలు లేవు.

హిట్ పడితేనే లక్కు.....

అయితే అను ఇమ్మాన్యువల్ నా పేరు సూర్య లో చేస్తున్న గ్లామర్ షోకి ఆ సినిమా గనక హిట్ పడిందా అమ్మడుకి లక్కు వస్తుంది. లేదంటే మాత్రం అను కి గడ్డు కాలం స్టార్ట్ అయినట్లే. నా పేరు సూర్య ట్రైలర్ అండ్ టీజర్, ప్రోమోస్ లోను పిచ్చ పిచ్చగా అందాల ఆరబోతకు దిగిన అను ఇమ్మాన్యువల్ ఈ సినిమా మీద భారీ హోప్స్ పెట్టుంది. ఈ సినిమా హిట్ అయ్యిందా అంటే.. అను ఎక్కడికో వెళ్ళిపోతుంది... ఈ సినిమా టాక్ ఎమన్నా తేడా కొట్టిందా ఇక అంతే అమ్మడుకి టాలీవుడ్ లో అగ్నిపరీక్షే.

భారీ అంచనాలే...

ఈరోజే ప్రేక్షకుల ముందుకు వస్తున్న నా పేరు సూర్యపై భారీ అంచనాలే ఉన్నాయి. మరి ఈ సినిమా హిట్ అవ్వాలని అను ఇమ్మాన్యువల్ మాత్రం గట్టిగానే కోరుకుంటుంది. ఈ సినిమా హిట్ అయితేనే.. లేదంటే ఎంతాగా అందాలు చూపించి గ్లామర్ షో చేసినా వేస్టే. ఇప్పటికే అజ్ఞాతవాసి సినిమాకి భారీ మూల్యం చెల్లించుకుంది అను. అజ్ఞాతవాసి ప్లాప్ తో ఎన్టీఆర్ సినిమాతో పాటుగా రామ్ చరణ్ - బోయపాటి సినిమాల్లో ఛాన్స్ కోల్పోయింది.

Similar News