అను నడుముకు ఫిదా..!

Update: 2018-09-21 06:21 GMT

గ్లామర్ షో చేయకపోతే అవకాశాలు తగ్గుతాయి అనుకుందేమో అందుకే గ్లామర్ షో కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అనుపమ పరమేశ్వరన్‌. కెరీర్ స్టార్టింగ్ లో ఇందుకు నో చెప్పిన ఈ మలయాళీ ముద్దుగుమ్మ గత కొంతకాలం నుండి ఫ్లాపులు చవి చూస్తుంది. ఇలాంటి టైంలో గిరి గీసి కూర్చుంటే కరెక్ట్ కాదని గుర్తించడమే కాకుండా నిత్య మీనన్ లాంటి హీరోయిన్స్ కనుమరుగు అయిపోయిన సంగతి గ్రహించి.. గ్లామర్ మీటర్ ను పెంచడానికి రెడీ అంటుంది. మరీ నార్త్ అమ్మాయిలలా చిన్నచిన్న బట్టల్లో కనిపించకపోయినా.. అచ్చమైన తెలుగు అమ్మాయిని తలపించేలా గ్లామర్ ను చూపించబోతుంది. లేటెస్ట్ గా అను నటించిన 'హలో గురూ ప్రేమకోసమే' టీజర్ రిలీజ్ అయింది. టీజర్ లో అను నడుము షోకి ఫ్యాన్స్ మొత్తం ఫిదా అయిపోయారు. చీర కట్టుకుని కుర్చుని తల ఆరేసుకుంటూ వెనక నుండి తన నడుమును హీరో రామ్ కు చూపించింది.

ఇక నో చెప్పదా..?

దీంతో అనుపమకి వస్తోన్న రెస్పాన్స్‌ చూస్తోంటేనే అనులో ఈ యాంగిల్‌ కూడా ఉందా అని ఆశర్యపోతున్నారు. చిన్న టీజర్ తోనే ఇలా అందరి మతి పోగొడితే మరి సినిమాలో ఏం మాయ చేస్తుందో చూడాలి. దీనినిబట్టి అను వచ్చే సినిమాల్లో కూడా గ్లామర్ కు నో చెప్పను అని చెప్పకనే చెప్పుతుంది. చూద్దాం ఈ గ్లామర్ షోకి మరిన్ని అవకాశాలు వస్తాయేమో.

Similar News