రమ్యకృష్ణ ముందు ఈమె డల్ అవుతుందా..!

Update: 2018-08-02 06:44 GMT

ఇప్పుడు టాలీవుడ్ లో హీరోయిన్ అను ఇమ్మాన్యువల్ పరిస్థితి ఏం బాగున్నట్టుగా లేదు. ఎందుకంటే అజ్ఞాతవాసి అట్టర్ ఫ్లాప్ కాగా.. నా పేరు సూర్య కూడా ఫ్లాప్ అయ్యింది. మరి మెగా హీరోలిద్దరు అను ఇమ్మాన్యువల్ కి గట్టి షాక్ ఇచ్చారు. పాపం ఆ రెండు సినిమాలు హిట్ అయినట్లయితే రామ్ చరణ్ - బోయపాటి సినిమాకి కూడా అను నే హీరోయిన్ గా తీసుకునేవారు. అంతెందుకు త్రివిక్రమ్ అయితే ఎన్టీఆర్ కి అరవింద సమేత కోసం ఫిక్స్ అయ్యాడు. కానీ అజ్ఞాతవాసి తేడా కొట్టడంతో అనుని లైట్ తీసుకున్నారు. ఇక యంగ్ హీరో నాగ చైతన్య పక్కన శైలజ రెడ్డి అల్లుడు సినిమాలో హీరోయిన్ గా మారుతీ మరోసారి అను ఇమ్మాన్యువల్ కి ఆఫర్ ఇచ్చాడు.

టీజర్ చేస్తే మాత్రం హిట్ గ్యారెంటీ అనాల్సిందే...

ఇక ఈ సినిమాలో రమ్యకృష్ణ నాగ చైతన్యకి అత్తగా, అను ఇమ్మాన్యువల్ కి అమ్మగా కీలకపాత్రలో నటిస్తుంది. అయితే ఈ సినిమాతోనే అను ఇమ్మాన్యువల్ కి హీరోయిన్ గా మనుగడ ఉంటుంది. మరి నిన్న రాత్రి విడుదల చేసిన శైలజ రెడ్డి అల్లుడు టీజర్ చూస్తుంటే అను ఇమ్మాన్యువల్ కి ఈ సినిమా హిట్ పక్కా అనిపిస్తుంది. డీసెంట్ రోల్ లో నాగ చైతన్య అను వెంటపడుతుంటే.. హాట్ హాట్ గా అను ఇమ్మాన్యువల్... కాస్త పొగరుగా అన్ని తాను అనుకున్నట్టే జరగాలని ఫీల్ అవుతూ పొగరుబోతు అమ్మాయిగా... తాను చెప్పినట్టు పడుండే బాయ్ ఫ్రెండ్ ని సెట్ చేసుకోవడం... ఇక నాగ చైతన్య మాత్రం అను వేషాలు చూసి చూసి పిల్లే ఇలా ఉంటె.. ఇక తల్లేలా ఉంటుందో అంటూ సరదాగా మాట్లాడడం.. ఇలా శైలజ రెడ్డి అల్లుడు టీజర్ అదిరింది.

రమ్యకృష్ణ ముందు తేలిపోతుందా..?

మరి మారుతీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాతో అను ఇమ్మాన్యువల్ పక్కాగా హిట్ అందుకోవడం ఖాయంగానే కనిపిస్తుంది. హాట్ హాట్ సారీస్ లో అను కూడా హాట్ గా బాగానే కనబడుతుంది. ఇక రమ్యకృష్ణ శైలజ రెడ్డి పాత్ర ముందు కూతురు అను ఇమ్మాన్యువల్ ఎలా హైలెట్ అవుతుందో అనేది ప్రస్తుతం ఉన్న అతి పెద్ద డౌట్. చూద్దాం అను ఫ్యూచర్ ని శైలజ రెడ్డి ఎలా డిసైడ్ చేస్తుంది అనేది కేవలం మరో నెల రోజుల్లోనే తేలిపోతుంది.

Similar News