పాపం అనుకి బ్లాక్ బస్టర్ పడదా...?

Update: 2018-09-14 09:17 GMT

నేచురల్ స్టార్ నానితో కలిసి మజ్ను మూవీతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన అను ఇమ్మాన్యువల్ కెరీర్ ప్రస్తుతం అతలాకుతలం అన్న పదానికి దగ్గరగా వుంది. మజ్ను, ఆక్సిజెన్, కిట్టు ఉన్నాడు జాగ్రత్త.. అజ్ఞాతవాసి, నా పేరు సూర్య ఇలా ఏ సినిమా కూడా అను ఇమ్మన్యువల్ కి సూపర్ హిట్ ఇచ్చిన పాపాన పోలేదు. పెద్ద స్టార్స్, పెద్ద డైరెక్టర్ కూడా అను ఇమ్మాన్యువల్ లక్కుని మార్చలేకపోయారు. అమ్మడుకి అందం, ఆకర్షణ, నటన అన్నీ ఉన్నా లక్కే లేదు. ఇక తాజాగా అను ఇమ్మాన్యువల్ నటించిన శైలజ రెడ్డి అల్లుడు సినిమా నిన్న గురువారం వినాయక చవితి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాకు యావరేజ్ టాకే వచ్చింది.

నటనతో మెప్పించినా...

మరి నాగ చైతన్యతో అయినా లక్కు మారుతుంది అనుకున్న అనుకి మళ్లీ నిరాశే ఎదురైంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన శైలజ రెడ్డి అల్లుడు సినిమాలో అను ఇమ్మాన్యువల్ అందంగా, గ్లామర్ గా కనిపించి ఆకట్టుకుంది. అను ఇమ్మాన్యువల్ పొగరు నిండిన అమ్మాయిగా బాగా నప్పింది. యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం అనవసరం. ఈగో బాగా తలకెక్కిన అను రెడ్డి పాత్రలో బాగానే మెప్పించింది. తల్లితో పోటీ పడి మరీ ఈగో చూపించిన అను ఈ సినిమాలో నటనపరంగా కూడా బాగా చేసింది. నాగ చైతన్యతో రొమాంటిక్ సీన్స్ లో అను చక్కటి నటన ప్రదర్శించింది. ఇక చైతుతో ఏకంగా లిప్ లాక్ కూడా పెట్టేసిన అను కి ఈ సినిమాతో పెద్దగా ఒరిగేదేమి కనబడం లేదు. ఎందుకంటే మారుతి ఈ సినిమాని హ్యాండిల్ చెయ్యడంలో తడబడడం వలన సినిమాకి యావరేజ్ టాక్ వచ్చిందనాటున్నారు. గత చిత్రాల్లో మారుతి పండించిన కామెడీ శైలజ రెడ్డి అల్లుడు లో మిస్ కావడం వలన సినిమా యావరేజ్ కి పడిపోయిందనే టాక్ నడుస్తుంది. మరి ఈ చిత్రం హిట్ అయితే అనుకి మంచి అవకాశాలొచ్చేవే... కానీ సినిమాకి యావరేజ్ టాక్ రావడం అను కెరీర్ కి కాస్త అవరోధంగానే మారిందని చెప్పాలి.

Similar News