అనూ క్రేజీ ప్రాజెక్ట్ ద‌క్కిందే..!

నాని ‘మజ్ను’ మూవీతో తెలుగుతెరకు పరిచయమైన మలయాళి బ్యూటీ అనూ ఇమ్మాన్యువ‌ల్ కు హిట్ సినిమాల కంటే డిజాస్టర్ అయిన సినిమాల సంఖ్య ఎక్కువ ఉంది. గత [more]

Update: 2019-05-08 08:32 GMT

నాని ‘మజ్ను’ మూవీతో తెలుగుతెరకు పరిచయమైన మలయాళి బ్యూటీ అనూ ఇమ్మాన్యువ‌ల్ కు హిట్ సినిమాల కంటే డిజాస్టర్ అయిన సినిమాల సంఖ్య ఎక్కువ ఉంది. గత ఏడాది ఈమె చేసిన మూడు సినిమాలు డిజాస్టర్స్ కావడం విశేషం. ‘అజ్ఞాతవాసి’, ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’, ‘శైలజా రెడ్డి అల్లుడు’ సినిమాలతో వరుస డిజాస్టర్స్ అందుకున్న అను ఆ తరువాత ఒక్క సినిమా కూడా ఓకే చేయలేదు.

క్రేజీ ప్రాజెక్ట్ లో ఛాన్స్

అయితే తాజా సమాచారం ప్రకారం ఆమెకు లేటెస్ట్ గా ఒక ఆసక్తికరమైన ప్రాజెక్ట్ దక్కిందట. కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ నటించబోతున్న ఒక సినిమాలో హీరోయిన్ గా ఈమెను ఎంపిక చేశారట. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను పాండిరాజ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ అను కెరీర్ కి చాలా బాగా ప్లస్ అవుతుందని చెబుతున్నారు. మరి అనుకు ఈ సినిమా అయినా బ్రేక్ ఇస్తుందేమో చూద్దాం.

Tags:    

Similar News