పాపం అను

Update: 2018-04-21 11:36 GMT

టాలీవుడ్ లో ఎలాగైనా పాతుకుపోవాలని చాలానే ట్రై చేస్తుంది మలయాళం బ్యూటీ అను ఇమాన్యుయేల్. మొదటి నుండే పెద్ద పెద్ద స్టార్స్ తో సినిమాలు చేసిన, టాలీవుడ్ లో గ్లామర్ హీరోయిన్ గా స్టార్ స్టేటస్ దక్కితే.. ఆ కిక్కే వేరుగా ఉంటుంది.

మొదటి నుండే ఈ అమ్మాయికి కలిసిరాలేదు. పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద హీరో పక్కన చేసిన ఆమెకు అందాల్సిన స్టార్ స్టేటస్ కూడా అందకుండా వెళ్లిపోయింది. అలాగని ఈమె టాప్ హీరోయిన్ రేసు నుంచి తప్పుకున్నట్లు ఏమీ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఈ భామ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయ్. ఒకటి అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమా. ఈ సినిమా వచ్చే నెలలో రిలీజ్ కు రెడీ అవుతుంది.

రెండోవది నాగ చైతన్య - మారుతీ కాంబినేషన్ లో వస్తున్న శైలజా రెడ్డి అల్లుడు సినిమాలో హీరోయిన్ గా నటించేస్తోంది. ఈ సినిమా ఆగస్ట్ నెల నాటికి విడుదల అయే అవకాశం ఉందని అంటున్నారు. మూడొవది శ్రీను వైట్ల - రవి తేజ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది అను.మూడు ప్రాజెక్టులు చేతిలో ఉండడంతో.. తన స్థాయిని పెంచుకునేందుకు అమ్మడికి ఇంకా చాలానే స్కోప్ ఉందని చెప్పవచ్చు.

Similar News