త్వరలోనే 'అంతరిక్షం 9000 KMPH '..!

Update: 2018-10-01 12:50 GMT

వరుణ్ తేజ్, అదితీరావు హైదరి, లావణ్య త్రిపాఠి కలిసి నటిస్తున్న 'అంతరిక్షం 9000 KMPH ' చిత్రం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.. ఈ విషయాన్ని సినిమా హీరో వరుణ్ తేజ్ ట్విట్టర్ లో తెలియజేశారు. షూటింగ్ స్పాట్ లో ని ఓ ఫోటోని యాడ్ చేస్తూ ఈ చిత్రానికి పనిచేయడం ఎంతో అమేజింగ్ గా అనిపించింది అని వెల్లడించారు. మొదటి సినిమా 'ఘాజి' తో నేషనల్ అవార్డు గెలుచుకున్న సంకల్ప్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. హైటెక్నికల్ వాల్యూస్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా యాక్షన్ ఎపిసోడ్స్ ని హాలీవుడ్ నిపుణులు డిజైన్ చేయగా విజువల్ ఎఫెక్ట్స్ ని కూడా హై లెవెల్లో ప్లాన్ చేశారు. త్వరలోనే ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్ ని అధికారికంగా ప్రకటించనున్నారు చిత్ర నిర్మాతలు.

నిర్మాతగా మారిన క్రిష్

ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ రాగా, ఇప్పటి వరకు తెలుగులో రాని ఒక విభిన్నమైన కాన్సెప్టుతో వస్తున్న సినిమా కావడంతో అందరిలో మంచి అంచనాలు పెరిగాయి.. జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీని అందిస్తున్న ఈ సినిమాని దర్శకుడు జాగర్లమూడి క్రిష్, సాయి బాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డిలు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. డిసెంబర్ 21 న సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవబోతుండగా తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా సరికొత్త అనుభూతిని మిగిల్చబోతుంది. తెలుగులో పూర్తిస్థాయి 'అంతరిక్షం' నేపథ్యంలో రూపొందిన తొలి సినిమా ఇదే.

Similar News