`అంతరిక్షం' కథ ఇదే..!

Update: 2018-11-30 10:38 GMT

సౌత్ ఇండియా లో ఆల్రెడీ స్పేస్ నేపథ్యంలో సినిమా ఒకటి వచ్చింది. తమిళంలో 'టిక్ టిక్ టిక్' అనే పేరుతో వచ్చిన ఈ సినిమాలో జయం రవి, నివేత పేతురాజు నటించారు. ఈ సినిమా అనుకున్న స్థాయిలో అయితే ఆడలేదు. అయితే ఈసారి తెలుగు లో అటువంటి జోనర్ లో సంకల్ప్ రెడ్డి... వరుణ్ తేజ్, లావణ్యలనిi పెట్టి 'అంతరిక్షం 9000కెఎంపిహెచ్' అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇది కూడా స్పేస్ నేపథ్యంలో సినిమా అంటే గ్రావిటీ - స్పేస్ ఒడిస్సీ లాంటి సినిమా. ఈ డైరెక్టర్ అంతకుముందు తొలి ప్రయత్నమే జలాంతర్గామి నేపథ్యంలో 'ఘాజి' సినిమా తీసి మెప్పించాడు. ఈసారి అంతరిక్షం బ్యాక్ డ్రాప్ తో వస్తున్నాడు. డిసెంబర్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఏ తరహా కథాంశంతో తెరకెక్కిస్తున్నారు? అన్నది తెలుసుకోవాలన్న తపన అభిమానుల్లో ఉంది.

స్పేస్ సైంటిస్ట్ గా...

ఈ సినిమాలో వరుణ్ ది ఛాలెంజింగ్ రోల్ అంట. జాబ్ కోల్పోయిన యువ స్పేస్ సైంటిస్ట్ పాత్రలో వరుణ్ తేజ్ నటిస్తున్నాడు. ఉద్యోగం కోల్పోయి ఖాళీగా ఉన్న వరుణ్ అత్యవసర సన్నివేశంలో భారతదేశాన్ని కాపాడేందుకు తిరిగి విధులకు హాజరవుతాడు. ఆలా ఎందుకు జరిగింది? ఇతను దేశాన్ని ఎలా కాపాడుతాడు? వరుణ్ చేపట్టిన ఆ ఆపరేషన్ ఏంటి? లావణ్య - అతిదీరావ్ హైదరీ వరుణ్ కి ఎలా పరిచయం అవుతారు? అన్నది తెరపైనే చూడాలని చెబుతున్నారు యూనిట్ సభ్యులు. స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్ అండ్ సీరియస్ గా ఉంటుందని చెబుతున్నారు. లేటెస్ట్ గా విడుదల అయిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

Similar News