‘అంతరిక్షం’ పరిస్థితేంటి..?

Update: 2018-12-24 12:52 GMT

వరుణ్ తేజ్ - సంకల్ప్ రెడ్డి కాంబోలో స్పేస్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన అంతరిక్షం ఫస్ట్ వీకెండ్ దిగ్విజయం గా పూర్తి చేసుకుంది. ఫస్ట్ షోకే పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. ఈ సినిమా కేవలం మల్టిప్లెక్స్ ఆడియన్స్ ని మాత్రమే ఎంటర్టైన్ చేస్తుంది. బీ, సీ సెంటర్స్ కి అంతరిక్షం ఎక్కదనేశారు. ఇక అతిధీరావు, లావణ్య త్రిపాఠి హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాను ప్రేక్షకులు బాగానే ఆదరిస్తున్నారు. ఇక ఓవర్సీస్ ప్రేక్షకుల నుండి కూడా అంతరిక్షం మంచి టాక్ తెచ్చుకుంది. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా అంతరిక్షం ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

ఏరియా షేర్స్(కోట్లలో)

నైజాం 1.48

సీడెడ్ 0.49

నెల్లూరు 0.11

కృష్ణ 0.22

గుంటూరు 0.34

వైజాగ్ 0.32

ఈస్ట్ గోదావరి 0.25

వెస్ట్ గోదావరి 0.14

ఏపీ, టీఎస్ షేర్స్ 3.35

ఇతర ప్రాంతాలు 0.50

ఓవర్సీస్ 0.75

టోటల్ వరల్డ్ వైడ్ షేర్స్ 4.60

Similar News