అంతరిక్షాన్నే నమ్ముకున్న చిన్నది!

Update: 2018-12-21 07:58 GMT

మణిరత్నం చెలియాతో సౌత్ లోకి వచ్చిన బాలీవుడ్ భామ అదితి రావు హైదరి ఆ సినిమాతోనే కోలుకోలేని ఫ్లాప్ అందుకుంది. ఇక మళ్లీ బాలీవుడ్ కి వెళ్లిపోయి తన సినిమాలేవో తాను చేసుకుంటుంటే.. సుధీర్ బాబు - ఇంద్రగంటిలు సమ్మోహనం సినిమా కోసం మళ్లీ టాలీవుడ్ కి తీసుకొచ్చారు. ఆ సినిమా హిట్ టాకొచ్చినా కలెక్షన్స్ మాత్రం నిల్. అయితే సమ్మోహనం సినిమాలో అదితి రావుకి మంచి పేరొచ్చినా.. అవకాశాలు పెద్దగా రాలేదు. సుధీర్ బాబుతో హిట్ కొట్టలేని అదితి రావు ఈసారి సంకల్ప్ రెడ్డి దృష్టిలో పడింది. సంకల్ప్ రెడ్డి వరుణ్ తేజ్ పక్కన సెకండ్ హీరోయిన్ గా అంతరిక్షం సినిమాకి ఎంపిక చేసాడు. ఇక వరుణ్ తేజ్ తో శాటిలైట్ ని కోడింగ్ చేసే టీంలో వరుణ్ తేజ్ పక్కనే ఉండే క్యారెక్టర్ లో మెరిసింది. మరి ఈ మూవీ ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆమె మరో హీరోయిన్ లావణ్య త్రిపాఠితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది.

సినిమాపై మంచి అంచనాలు

మంచి అంచనాలతో విడుదలవుతున్న అంతరిక్షంపై ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ ఉంది. ట్రైలర్ తోనే సినిమా మీద అంచనాలు పెంచేసిన సంకల్ప్ రెడ్డి.. సినిమాలో మరెన్ని సిత్రాలు చూపిస్తాడో అనే క్యూరియాసిటీతో ప్రేక్షకులు ఉన్నారు. సినిమా హిట్ అవుతుందని వరుణ్ తేజ్ అండ్ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి ధీమాతో ఉన్నారు. ఒకవేళ ఈ సినిమా హిట్ అయితే అదితి రావుకి తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తాయి. లేదంటే వచ్చిన దారినే అంటే మళ్లీ బాలీవుడ్ దారి పట్టాలి. అక్కడా ఓ అన్నంత అవకాశాలు లేకపోయినా... పద్మావతి చిత్రంలో అల్లావుద్దీన్ ఖిల్జీకి భార్యగా నటించినట్లుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేసుకుంటూ పోవాలి. చూద్దాం అదితి జాతకం అంతరిక్షం ఏం చేస్తుందో.

Similar News