ఎఫ్ 3 నటించే మరో హీరో ఎవరు..?

ఈ ఏడాది స్టార్టింగ్ లోనే సూపర్ హిట్ గా నిలిచిన ఎఫ్ 2 సినిమాను అనిల్ రావిపూడి తనదైన స్టైల్ తో తీసి సక్సెస్ అయ్యాడు. అనిల్ [more]

Update: 2019-01-22 06:21 GMT

ఈ ఏడాది స్టార్టింగ్ లోనే సూపర్ హిట్ గా నిలిచిన ఎఫ్ 2 సినిమాను అనిల్ రావిపూడి తనదైన స్టైల్ తో తీసి సక్సెస్ అయ్యాడు. అనిల్ తీసిన సినిమాలు వరసగా హిట్ అవ్వడంతో మనోడితో సినిమా చేయడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎఫ్ 2 చివరిలో ఎఫ్ 3 ఉండబోతున్నట్టు చెప్పిన అనిల్ ఇందులో ఇద్దరు హీరోలే కాకుండా మరో హీరోకి కూడా ఛాన్స్ ఉన్నట్టు సమాచారం. ఎఫ్ 2లో తోడల్లుళ్లుగా వరుణ్ తేజ్, వెంకీ నటించారు. అయితే ఎఫ్ 3 నటించనున్న ఆ మూడో హీరో ఎవరై ఉంటాడు అనేది చర్చ మొదలైంది. ఈ సినిమా ఇప్పట్లో స్టార్ట్ అవ్వకపోయిన వచ్చే ఏడాది ఉండొచ్చు అంటున్నారు. అయితే మూడో హీరో విషయం లో అనిల్ ఆల్రెడీ ఓ క్లారిటీకి వచ్చాడని సమాచారం.

ఇద్దరిలో ఒకరికి ఛాన్స్…

ఆ ఛాన్స్ ర‌వితేజ లేదంటే నానికి ద‌క్కే అవ‌కాశాలున్నాయ‌ని తెలుస్తోంది. రవితేజతో అనిల్ కు 'రాజా ధి గ్రేట్‌' చేసిన అనుభం ఉంది. రవి కామెడీ స్టైల్ ఎఫ్ 3కి కచ్చితంగా సరిపోతుంది. ఒకవేళ రవిని ఎఫ్ 3లో తీసుకుంటే సినిమాకు కచ్చితంగా అడ్వాంటేజ్ అవుతుందని చెబుతున్నారు. అయితే అనిల్.. రవి వైపే కాకుండా నాని వైపు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు టాక్. నాని కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉంటుంది. ఇద్దరిలో ఎవరిని తీసుకున్నా సినిమాకు మరింత హెల్ప్ అవుతుంది. మరి ఎవరిని తీసుకుంటాడో అనేది అనిల్ చేతిలోనే ఉంది.

Tags:    

Similar News