మహర్షి హిట్ మాత్రమే కాదు.. మరో గుడ్ న్యూస్ కూడా..!

ప్రస్తుతం మహేష్ బాబు మహర్షి సినిమా విజయంతో పార్టీల మీద పార్టీలు చేసుకోవడమే కాదు.. సినిమాని కూడా తెగ ప్రమోట్ చేస్తున్నాడు. 25వ సినిమా హిట్ అవడంతో [more]

Update: 2019-05-17 09:54 GMT

ప్రస్తుతం మహేష్ బాబు మహర్షి సినిమా విజయంతో పార్టీల మీద పార్టీలు చేసుకోవడమే కాదు.. సినిమాని కూడా తెగ ప్రమోట్ చేస్తున్నాడు. 25వ సినిమా హిట్ అవడంతో మహేష్ బాబు గాల్లో తేలుతున్నాడు. మహేష్ అభిమానులు కూడా మహర్షి సినిమా విజయంతో హ్యాపీగా ఉన్నారు. ఇక మహేష్ బాబు ఎంత అందగాడు అనేది ఎప్పటికపుడు చూస్తూనే ఉన్నాం. వయసు పెరిగే కొద్దీ అందం తరుగుతుంది అంటారు కానీ… మహేష్ అందం మాత్రం చెక్కుచెదరడం లేదు. అలాంటి అందగాడు ఇప్పుడు మహర్షి విజయంతో పాటుగా మరో గుడ్ న్యూస్ తో కూడా ఎంజాయ్ చేస్తున్నాడు.

సౌత్ నుంచి మొదటిసారిగా…

ఎప్పుడూ బాలీవుడ్ హీరోస్ కి మాత్రమే సొంతమయ్యే మోస్ట్ డిసైరబుల్ మెన్ లిస్ట్ లో ఈసారి మహేష్ కూడా చోటు సంపాదించాడు. ప్రతిష్టాత్మక టైమ్స్ మ్యాగజైన్ ప్రతి ఏడాది దేశవ్యాప్తంగా యూత్ లో ఆయా హీరోలకు ఉన్న పాపులారిటీ ఆధారంగా ర్యాంక్స్ ఇస్తుంది. అలా ఎప్పటినుండో బాలీవుడ్ హీరోలైన సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ లాంటి వాళ్లకే చోటు దక్కేది. కానీ ఇప్పుడు మొట్టమొదటిసారిగా సౌత్ నుండి మహేష్ బాబుని మోస్ట్ డిసైరబుల్ మెన్ లిస్ట్ లో చేర్చారు. ఈ వార్త మహేష్ అభిమానులే కాదు.. సౌత్ ప్రేక్షకులు గర్వంగా ఫీల్ రావాల్సిన విషయమే.

Tags:    

Similar News