‘మా’లో మరో వివాదం..!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు అత్యంత రసవత్తరంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో నరేష్.. శివాజీ రాజా పై గెలుపొందారు. కాగా ఈ నూతన కార్యవర్గం [more]

Update: 2019-03-16 12:36 GMT

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు అత్యంత రసవత్తరంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో నరేష్.. శివాజీ రాజా పై గెలుపొందారు. కాగా ఈ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం ఈ నెల 22న జరగనుంది. అయితే శివాజీ రాజా పదవీకాలం ఈ నెల 31 వరకు ఉండటంతో అప్పటి వరకు ‘మా’ కుర్చీలో ఎవరూ కూర్చోవద్దని, లేదా కోర్టుకు వెళ్తానని శివాజీ రాజా ఫోన్ చేసి బెదిరిస్తున్నారని నరేష్ ఆవేదన వ్యక్తం చేసారు. ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ కృష్ణమోహన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన పలు విషయాలు వెల్లడించారు. మాలో కొన్ని అవకతవకలు జరిగిన మాట వాస్తవమని, అవన్నీ మర్చిపోయి మా గుట్టు బయటపడకుండా అందరినీ కలుపుకుపోయి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. కానీ తమ పని తాము చేసుకోవడానికి కూడా సహకరించడం లేదన్నారు.

Tags:    

Similar News