అంజలి ఏంటి ఇలా అయిపోయింది!!

ఈమధ్యన అంజలి లుక్స్ పై చాలా కామెంట్స్ సోషల్ మీడియాలో రేజ్ అవుతున్నాయి. అవకాశాలు పెద్దగా లేని అంజలి బరువు తగ్గడంపై బాగా శ్రద్ద పెట్టినట్టుగా ఉంది. [more]

Update: 2020-11-09 05:07 GMT

ఈమధ్యన అంజలి లుక్స్ పై చాలా కామెంట్స్ సోషల్ మీడియాలో రేజ్ అవుతున్నాయి. అవకాశాలు పెద్దగా లేని అంజలి బరువు తగ్గడంపై బాగా శ్రద్ద పెట్టినట్టుగా ఉంది. అందుకే బాగా బరువు తగ్గి సన్నగా తయారైంది. చక్కగా బొద్దుగా ఉండే అంజలి అలా బరువు తగ్గడంతో ఆమె ఫేస్ లో గ్లో మొత్తం పోయింది. మొన్నామధ్యన అంజలి నటించిన నిశ్శబ్దం సినిమా విడుదల అయినప్పుడు అనుష్క కన్నా ఎక్కువగా అంజలినే అన్నారు. అంజలి స్క్రీన్ స్పెస్ తీసుకుంది కానీ పెద్దగా ప్రాధాన్యత లేని పాత్ర చెయ్యడంతో.. విమర్శలపాలయ్యింది. నిశ్శబ్దం లో అంజలి నటనకు మైనస్ మార్కులు పడ్డాయి.

అదలా ఉంటే తాజాగా అంజలి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోస్ లో అంజలి లుక్స్ చూస్తే ఆమ్మో అంజలి ఏమిటి ఇలా తయారైంది అంటారు. నిజంగా అంజలి సన్నగా నాజూగ్గా అయితే ఉండొచ్చు కానీ.. మోహంలో కళా కాంతులు లేవు. రెడ్ కలర్ లెహంగా లో అంజలి.. గ్రీన్ కలర్ ఓని వేసుకుని చక్కటి తెలుగింటి ఆడపిల్లలా కనిపిస్తుంది. కానీ ఆమె ఫేస్ విషయంలోనే అసలు లుక్ బయటకి కనబడుతుంది. సన్నబడినా ఫేస్ విషయంలో అంజలి తగిన జాగ్రత్త పడి ఉంటె.. ఇప్పుడు ఇన్ని కామెంట్స్, ఇన్ని విమర్శలు ఉండేవి కాదు. ఫిజిక్ పర్ఫెక్ట్ గా ఉన్నా మొహంలో గ్లో ఉంటేనే అవకాశాలు వస్తాయి.. మరి సన్నబడే క్రమంలో హీరోయిన్స్ అందవిహీనంగా తయారవడం చూస్తుంటే ఏం చెప్పాలో తెలియడం లేదు.  మరి అంజలి కొత్త లుక్ ని మీరు ఓ లుక్కెయ్యండి.

Tags:    

Similar News