అంజలి ఆలా చేస్తే వర్కౌట్ అవ్వుద్దా?

తెలుగు, తమిళంలో టాప్ హీరోయిన్ అవుదామనుకున్న రాజోలు పాప అంజలికి అన్ని ఎదురొస్తున్నాయి. ఎక్కడ కాలు పెడితే అక్కడ ప్లాప్ అన్నట్టుగా వుంది అంజలి వ్యవహారం. ఒక [more]

Update: 2019-06-02 05:09 GMT

తెలుగు, తమిళంలో టాప్ హీరోయిన్ అవుదామనుకున్న రాజోలు పాప అంజలికి అన్ని ఎదురొస్తున్నాయి. ఎక్కడ కాలు పెడితే అక్కడ ప్లాప్ అన్నట్టుగా వుంది అంజలి వ్యవహారం. ఒక వైపు జై తో లవ్ బ్రేకప్. మరోవైపు సినిమాల ప్లాప్. పాపం అంజలి అన్నట్టుగా తయారైంది వ్యవహారం. బొద్దుగా ఉండే ఈ బబ్లీ పాప.. సన్నబడితే అవకాశాలొస్తాయనుకుని…. వర్కౌట్స్ తో బక్క చిక్కిపోయింది. అయినా పాపకి అవకాశాలు లేవు సరికదా… నిన్నగాక మొన్న విడుదలైన హర్రర్ ఫిలిం లిసా కూడా అట్టర్ ప్లాప్ అయ్యింది. తెలుగు తమిళంలో విడుదలైన ఆ సినిమా అట్టర్ ప్లాప్ అవడంతో.. అంజలి ఇప్పుడు రూట్ మార్చింది.

తక్కువ రెమ్యునరేషన్ కే సినిమాలు చేస్తానంటూ.. అటు కోలీవుడ్ దర్శకనిర్మాతలతో పాటుగా… ఇటు తెలుగు దర్శకనిర్మాతలకు ఫోన్ కలుపుతుందట. మరి అంజలి ని దర్శకనిర్మాతలెవరైనా దయతలిస్తే ఓకె. లేదంటే అంజలి కెరీర్ ముగిసినట్టే. ఇక మరీ లేడి ఓరియెంటెడ్ సినిమాలు చెయ్యకుండా ఈసారి కామెడీ ని నమ్ముకోవాలనే ఉద్దేశ్యంతో అంజలి ఉందట. అందుకే దర్శకనిర్మాలకు అంజలి ఓపెన్ ఆఫర్ ఇస్తుంది. చూద్దాం.. అంజలి రెమ్యునరేషన్ తగ్గిస్తే అవకాశాలొస్తాయా.. అనేది!

Tags:    

Similar News