హైదరాబాద్ రోడ్స్ మీద తిరగడం అంటేనే ఇష్టం?

చాలామంది సినిమా తారలు విదేశాల్లో ఎంజాయ్ చేసినా హైదరాబాద్ లో ఉండడం అంటేనే ఇష్టం అంటుంటారు. అలాగే మరో తెలుగు తార అంజలి కూడా షూటింగ్స్ కోసం, [more]

Update: 2020-10-05 07:29 GMT

చాలామంది సినిమా తారలు విదేశాల్లో ఎంజాయ్ చేసినా హైదరాబాద్ లో ఉండడం అంటేనే ఇష్టం అంటుంటారు. అలాగే మరో తెలుగు తార అంజలి కూడా షూటింగ్స్ కోసం, వెకేషన్స్ కోసం ఎక్కెడెక్కడా తిరిగినా నాకు హైదరాబాద్ రోడ్ల మీద తిరగడమే హాయిగా అనిపిస్తుంది అంటుంది అంజలి. తెలుగు హీరోయిన్ అయినప్పటికీ.. తమిళనాట స్థిరపడిన అంజలి అవకాశం వచ్చినప్పుడు తెలుగులో కూడా నటించేస్తుంది. తాజాగా అనుష్క నిశ్శబ్దం సినిమాతో తెలుగు, తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన అంజలి తన మనసులోని మాటలని ఓ ఇంటర్వ్యూ లో బయటపెట్టింది.

తనకి కాజోల్, శోభన అంటే చాలా ఇష్టముంటుంది. ఇక చిన్నప్పటినుండి సినిమాలంటే లోకం గా పెరిగాను.. అందుకే హీరోయిన్ అవ్వకపోతే మారేదన్నా అనే ఊహే నాలో లేదంటుంది అంజలి. ఇక మణిరత్నం అంటే చాల ఇష్టమని.. కొన్ని సినిమా ఫంక్షన్స్ లో ఆయన్ని కలిశా కానీ.. ఆయనతో నటించే అవకాశం రాలేదని.. వస్తే మాత్రం వదులుకోనని చెబుతుంది అంజలి. ఇక ఇండస్ట్రీలో ఎంతమంది స్నేహితులు ఉన్నప్పటికీ.. నా మొదటి సినిమా ఫోటో లో నటించిన నా సహా నటి భానుతోనే నేను అన్ని విషయాలను షేర్ చేసుకోగలను అంటుంది. ఇక ఇష్టమైన ఆహారం థాయ్ కర్రీ, చిక్కి అంటే ఇష్టమన్న అంజలికి ఏ ఆర్ రెహ్మాన్ సంగీతం అంటే చెవులు కోసుకుంటుందట. 

Tags:    

Similar News