మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ పంట పండిందిగా...

Update: 2018-05-31 07:18 GMT

శంకర్ రోబో 2 సినిమా ఇంకా రిలీజ్ డేట్ కూడా ప్రకటించకుండా అప్పుడే తన తర్వాత సినిమాపై ఫోకస్ పెట్టాడు. కమల్ హాసన్ తో భారతీయుడు-2 తీయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి రీసెంట్ గా పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. రోబో 2 రిలీజ్ అవ్వగానే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకుని వెళ్లనున్నారు శంకర్.

తమిళ్ తో పాటే తెలుగులోనూ...

తెలుగులో ఈ సినిమాని బడా నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఒకేసారి తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ చిత్రానికి తొలుత సంచలన సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ ని తీసుకుందామని అనుకున్నారట. కొన్ని కారణాలు వల్ల అయన ఈ సినిమా నుండి తప్పుకున్నారు. రెహమాన్ తప్పుకోవడంతో వేరే మ్యూజిక్ డైరెక్టర్ ను వెతికే పనిలో పడ్డారట నిర్మాత మరియు దర్శకుడు.

ఇద్దరికీ ఒకేసారి...

అందులో భాగంగా వారు అనిరుధ్ ను ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంచుకున్నట్లు సమాచారం అందుతోంది. ఈ విషయం గురించి అనిరుధ్ ని సంప్రదించగా వెంటనే ఒకే చేసాడంట. త్వరలోనే లీగల్ అగ్రిమెంట్ పై సంతకం కూడా చేయనున్నాడు. అయితే ఇందులో ఒక గమ్మత్తయిన విషయం ఏమిటంటే అనిరుధ్ ఇటీవల కార్తీక్ సుబ్బరాజ్, రజినీకాంత్ ల చిత్రానికి సంగీతం అందిస్తున్నట్లు ప్రకటన వచ్చింది. ఒకవేళ భారతీయుడు-2 కు కూడా అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఇద్దరు సూపర్ స్టార్స్ కి ఒకేసారి పనిచేయడం అనిరుధ్ అదృష్టమే.

Similar News