అప్పుడు ఫ్లైట్ ఎక్కినవాడు... మళ్ళీ ఇన్నాళ్ళకి తేలాడు

Update: 2018-07-20 08:49 GMT

దర్శకుడు త్రివిక్రమ్ కి కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ అంటే చచ్చేంత ఇష్టం. వై దిస్ కొలవెరి... దగ్గరనుండి త్రివిక్రమ్.. అనిరుధ్ కి బడా ఫ్యాన్ అయ్యాడు. ఇక అప్పుడే తన సినిమాలో ఏదో ఒకదానికి మ్యూజిక్ డైరెక్టర్ ఛాన్స్ ఇద్దామనుకుని.... వెనక్కి తగ్గిన త్రివిక్రమ్ ఒకేసారి ఏకంగా స్టార్ హీరో పవన్ కళ్యాణ్ కోసం టాలీవుడ్ కి దింపాడు. అనిరుద్.. పవన్ - త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అజ్ఞాతవాసి సినిమా కోసం మ్యూజిక్ అందించడమే కాదు.. మనోడు సోలోగా తనని తానూ టాలీవుడ్ కి ప్రూవ్ చేసుకోవాలని..అలాగే పవన్ కళ్యాణ్ క్రేజ్ ని వాడుకోవాలని బోర్లా పడ్డాడు. ఇక అజ్ఞాతవాసి సినిమా ఆడియో కన్నా ఎక్కువగా తనని తాను ప్రమోట్ చేసుకున్నాడు ఈ కుర్ర మ్యూజిక్ డైరెక్టర్.

అయినా అనిరుధ్ మ్యూజిక్ ఓ అన్నంత లేకపోవడం... సినిమా డిజాస్టర్ కావడంతో.. మళ్ళీ చెనై ఫ్లైట్ ఎక్కేసిన అనిరుద్ కి త్రివిక్రమ్ - ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న అరవింద సమేతకి పిలుపొస్తుందనే ప్రచారం జరిగినా..తర్వాత దానికి థమన్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నారు. ఇక అనిరుద్ కి టాలీవుడ్ అవకాశాలు నిల్ అనుకున్న తరుణంలో మల్లీ ఇన్నాళ్ళకి మరో యంగ్ హీరో కోసం టాలీవుడ్ లోకి రాబోతున్నాడు. నేచురల్ స్టార్ నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో తెరకెక్కబోతున్న జెర్సీ సినిమాకి అనిరుధ్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపిక చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది.

క్రీడా నేపథ్యం అంటే క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా అనిరుధ్ బాగా సెట్ అవుతాడని... ఈ సినిమాకి బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఇంపార్టెంట్ అని అందుకే బాగా అలోచించి అనిరుద్ ని ఎంచుకున్నట్లుగా తెలుస్తుంది. మరి తమిళంలో బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరొంది టాప్ లెవల్లో ఉన్న అనిరుధ్ కి అజ్ఞాతవాసి డిజాస్టర్ కాస్త బాధ కలిగించినా.. ఇప్పుడు ఆ సినిమా ప్లాప్ ని నాని జెర్సీ తో చెరిపేసి ఈ సినిమాతో హిట్ కొట్టి టాలీవుడ్ లో పాగా వెయ్యాలని చూస్తున్నాడు.

Similar News