దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటున్నాడు..!

టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఫ్లాప్ రుచి చూడని ఏ డైరెక్టర్లు ఎవరైనా ఉన్నారంటే రాజమౌళి, కొరటాల శివ తరువాత స్థానంలో అనిల్ రావిపూడి వస్తారు. కామెడీకి [more]

Update: 2019-01-19 06:15 GMT

టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఫ్లాప్ రుచి చూడని ఏ డైరెక్టర్లు ఎవరైనా ఉన్నారంటే రాజమౌళి, కొరటాల శివ తరువాత స్థానంలో అనిల్ రావిపూడి వస్తారు. కామెడీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ సినిమా తీయడంలో అనిల్ ఎక్స్పర్ట్. ‘పటాస్’, ‘సుప్రీమ్’, ‘ రాజా ది గ్రేట్ ‘ వరకు అన్ని సూపర్ హిట్ చిత్రాలే. రీసెంట్ గా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ‘ఎఫ్ 2’ సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో వరసగా నాలుగు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ సంక్రాంతికి ‘కథానాయకుడు’, ‘విన విధేయ రామ’, ‘పేట’తో పాటు ‘ఎఫ్ 2’ కూడా రిలీజ్ అయ్యి హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.

పారితోషకం కూడా పెంచేసి…

ఈ నేపథ్యంలో డైరెక్టర్ అనిల్ రావిపూడితో చాలామంది యంగ్, స్టార్ హీరోస్ సినిమా చేయడానికి ముందుకు వస్తున్నారు. అందుకే అనిల్ తన పారితోషకం పెంచేసినట్టు సమాచారం. మొన్నటివరకు అనిల్ ఒక్క సినిమాకు 3 కోట్ల వరకు తీసుకునేవాడు. ఇప్పుడు ‘ఎఫ్ 2’ హిట్ అవ్వడంతో 5 కోట్లు చెబుతున్నాడని టాక్. నిర్మాతలు అందుకు ఓకే కూడా చెబుతున్నారట. త్వరలోనే అనిల్ తన నెక్స్ట్ మూవీ డీటెయిల్స్ తెలియజేయనున్నాడు.

Tags:    

Similar News