అనిల్ ఇలా చేస్తున్నాడేంటి..?

సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ లిస్ట్ లోకి అనిల్ రావిపూడి కూడా చేరాడు. తీసిన నాలుగు సినిమాలూ కమెర్షియల్ గా హిట్ అవ్వడంతో మనోడి రేంజ్ అమాంతం పెరిగిపోయింది. [more]

Update: 2019-04-23 09:57 GMT

సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ లిస్ట్ లోకి అనిల్ రావిపూడి కూడా చేరాడు. తీసిన నాలుగు సినిమాలూ కమెర్షియల్ గా హిట్ అవ్వడంతో మనోడి రేంజ్ అమాంతం పెరిగిపోయింది. కొంతమంది ప్రొడ్యూసర్స్ అయితే అనిల్ దగ్గర కథలు లేకపోయినా ముందుగా అడ్వాన్సులు ఇచ్చి లాక్ చేసుకుంటున్నారు. అయితే మహేష్ బాబు వీళ్లలా కాదు. అనిల్ ఎఫ్ 2 తీస్తున్న టైంలో తన స్టోరీ చెప్పు అని కబురు పంపించాడు. ఏమీ ఆలస్యం చేయకుండా అనిల్ వెళ్లి మహేష్ కు ఓ మంచి మాస్ మసలా కథని చెప్పి ఓకే చేయించుకున్నాడు. కథ మొత్తం రెడీ చేయి.. సినిమా చేద్దాం అని కూడా మహేష్ హామీ ఇచ్చాడు. అలా ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతుందని వార్తలు వచ్చాయి. కానీ ఎక్కడా ఈ సినిమా గురించి చెప్పలేదు.

లేడీ ఓరియెంటెడ్ మూవీనా..?

అయితే అనిల్.. మహేష్ కి కథ చెప్పకముందే ఎఫ్ 2 రిలీజ్ అయ్యాక ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేసేందుకు అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నాడు. గురు తరహాలో ఈ సినిమా ఉంటుందని.. ఈ సినిమా తరువాతే మహేష్ ఉంటుందని ఇప్పుడు టాక్ వస్తుంది. అయితే ఈ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేసేందుకు మహేశ్ సైతం అనిల్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. మరి ఇందులో ఎంత నిజముందో వారికే తెలియాలి. మహేష్ లాంటి స్టార్ హీరో పిలిచి మరీ ఛాన్స్ ఇస్తే లేడీ ఓరియెంటెడ్ సినిమాల్ని తీయడం ఏంటి అని అనిల్ పై కామెంట్స్ పడుతున్నాయి. మరి మహేష్ నెక్స్ట్ ఎవరితో చేస్తాడో చూడాలి.

Tags:    

Similar News